AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాల్లో బయటపడిన 113 ఏళ్లనాటి పురాతన నాణెలు.. వాటిపై ఉన్న బొమ్మ ఎవరిదో తెలుసా?

ఈ మధ్యకాలంలో తవ్వకాల్లో పురాతన కాలం నాటి నాణెలు బయటపడుతున్న వరుస ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం తవ్వకాలు జరుపుతుండగా 1913లో ముద్రించిన వెండి నాణెలు బయటపడ్డాయి. అవి బ్రిటీష్‌ కాలం నాటి నాణెలుగా గుర్తించారు అధికారులు.

తవ్వకాల్లో బయటపడిన 113 ఏళ్లనాటి పురాతన నాణెలు.. వాటిపై ఉన్న బొమ్మ ఎవరిదో తెలుసా?
Rare British Era One Rupee Silver Coins Found In Morena
Anand T
|

Updated on: Aug 18, 2026 | 6:45 PM

Share

రోడ్డు నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా దాదాపు 100 ఏళ్లకు పైగా పురాతనమైన నాణెలు బయటపడిన సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మొరేనా జిల్లా డోంగర్‌పూర్ లోధా గ్రామం సమీపంలో ఇటీవల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే తవ్వకాలు జరుపుతుండగా కొన్ని వెండి నాణెలు బయటపడ్డాయి. అవి గమనించిన స్థానిక గ్రామస్తులు వాటిని తీసుకొని పరిశీలించగా వాటిపై కొన్ని బొమ్మలు కనిపించాయి.

అయితే ఈ విషయం ఆనోట ఈనోట పాకి పోలీసుల దృష్టికి చేరడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నాణెలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పురావస్తు శాఖ అధికారుల సహాయంతో వాటి గురించి తెలుసుకున్నారు. అయితే ఈ నాణెలు 1913 కాలనాకి చెందనవని.. దానిపై ముద్రించబడి ఉన్న చిత్రం బ్రిటీష్ అధికారి ఐదవ జార్జ్‌కు చెందినదని గుర్తించారు. అప్పట్లో ముంబై, కోల్‌కతా మింట్‌లలో ఇటువంటి నాణేలను ముద్రించేవారని తెలిపారు.

నాణెంపై ఏముంది?

1913 నాటి ఈ నాణెంపై ఒకవైపు ఐదవ జార్జ్ చిత్రపటం, పేరు ఉండగా.. మరోవైపు పూల డిజైన్ల మధ్య ‘ONE RUPEE INDIA’ అని ముద్రించి ఉంది. అక్కడ దొరికిన నాణెలు ప్రస్తుతం మాతా బసయ్యా పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచామని, ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత వీటిని పూర్తిస్థాయి పరిశోధనల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us