Cock Fighting centers : ప.గో జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగపాకలలో కోడిపందేల బరులపై పోలీస్ దాడులు

|

Jun 09, 2021 | 4:10 PM

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో కోడి పందేలు నిర్వహిస్తోన్న బరులపై..

Cock Fighting centers : ప.గో జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగపాకలలో కోడిపందేల బరులపై పోలీస్ దాడులు
Cock Fighting
Follow us on

Police Raid on Cock Fighting centers : పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో కోడి పందేలు నిర్వహిస్తోన్న బరులపై పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పెనుమంట్ర సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎన్ వి వి రమేష్, సిబ్బంది కోడిపందేలు నిర్వహిస్తోన్న కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. పెనుమంట్ర మండలం జుత్తిగపాకల మావుళ్ళమ్మ గుడి శివారు పొలలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందేల బరులపై దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర్నుంచి 7,350 నగదు, 2 కత్తులు, 1 కోడి పుంజు, 11 మోటర్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందేలు ఆడుతున్న, నిర్వహిస్తోన్న వారిపై ఏపీ గేమింగ్ క్రూయల్టీ ఎక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ‘కోడి పందేలు, జూదం, కోదాట అడడం చట్ట రీత్యానేరం .. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పెనుమంట్ర సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎన్ వి వి రమేష్ చెప్పారు.

ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎన్ వి వి రమేష్ సహా హెడ్ కానిస్టేబుల్స్ మూర్తి, రాధాకృష్ణ , కానిస్టేబుల్స్ వీర్రాజు, సురేష్ పాల్గొన్నారు.

Read also :