Jobs Fraud: ఆదిలాబాద్‌లో నకిలీ అటవీ శాఖ అధికారి.. ఉద్యోగాల పేరిట భారీ టోకరా.. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చి మరీ..

|

Oct 11, 2021 | 4:47 PM

Jobs Fraud: నకిలీ ఉద్యోగాల పేరిట ఎన్ని రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నా.. పోలీసులు ప్రజలను ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రజలు మోసపోతునే ఉన్నారు. మన ఆశనే..

Jobs Fraud: ఆదిలాబాద్‌లో నకిలీ అటవీ శాఖ అధికారి.. ఉద్యోగాల పేరిట భారీ టోకరా.. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చి మరీ..
Follow us on

Jobs Fraud: నకిలీ ఉద్యోగాల పేరిట ఎన్ని రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నా.. పోలీసులు ప్రజలను ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రజలు మోసపోతునే ఉన్నారు. మన ఆశనే పెట్టుబడిగా పెట్టి కొందరు మోసాలను దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆదిబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో వసూళు చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం.. గుడిహత్నూర్‌ మండలానికి చెందిన పర్చే మోహన్‌ అనే వ్యక్తి తాను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌)లో ఉద్యోగం చేస్తున్నానని కొందరు అమాయక యువతను నమ్మించాడు. ఈ క్రమంలోనే అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. 6గురు యువకుల దగ్గర ఏకంగా రూ. 8 లక్షల 60 వేలను వసూలు చేశాడు.

ఈ క్రమంలోనే వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ కూడా ఇచ్చాడు. అయితే తాము తీసుకున్న లెటర్‌ నకిలీది అని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. బాధితులను పూర్తిగా నమ్మించే క్రమంలో పర్చే మోహన్‌, నిర్మల్‌ జిల్లాలో జిరాక్స్‌ దుకాణాన్ని నడిపే సెర్ల నర్సయ్యతో కలిసి ఏకంగా నకిలీ అపాయింట్‌మెంట్‌ లేటర్స్‌నే తయారు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 3 లక్షల రూపాయల నగదుతో పాటు అపాయింట్‌మెంట్‌ లెటర్‌లను తయారు చేయడానికి ఉపయోగించిన కంప్యూటర్‌, ప్రింటర్‌, స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి మాయలో పడి ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే ఎలాంటి భయం లేకుండా పోలీసులను ఆశ్రయించాలను ఎస్పీ రాజేశ్‌ చంద్ర ప్రకటన చేశారు.

Also Read: Health Director: డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకుంటే అంతే సంగంతి.. డీహెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరిక

CBSE Exams 2022: రెండు టర్మ్‌ల పరీక్షా విధానంలో సీబీఎస్ఈ పరీక్షలు.. ఈ కొత్త విధానం గురించి పూర్తిగా తెలుసుకోండి!

Hyd Airport Expand: హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్త‌ర‌ణ‌కు జీఎంఆర్‌ రూ.6300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌..!