తస్మాత్ జాగ్రత్త.. మోసం చేసేవాళ్లు నీడలా మనల్ని వెంటాడుతున్నారు. అలెర్ట్‌గా లేకపోతే సర్వం దోచుకుంటారు. కట్టుబట్టలతో రోడ్డుపై నిలుచోబెడతారు. తాజాగా హర్యానా(Haryana)లో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగుచూసింది. పెళ్లి పేరుతో.. చీటింగ్‌కు పాల్పడుతున్న ఓ కిలాడీ ముఠాను పోలీసులు అదుపోలకి తీసుకున్నారు. యువకులను ట్రాప్ చేసి.. పెళ్లి అనంతరం.. ఫస్ట్ నైట్ రోజునే ప్లాన్ అమలు చేస్తున్నారు. డబ్బు, నగలు, విలువైన వస్తువులతో జెండా ఎత్తేస్తున్నారు. ఇలా పెళ్లి పేరుతో గాలం వేసి ఏడుగురుని మోసం చేశారు. బాధితుల్లో నాలుగో వ్యక్తి.. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో మైండ్ బ్లాంకయ్యే నిజాలు వెలుగుచూశాయి. అయితే ఈ ముఠాకు ఒక స్పెషాలిటీ ఉంది. విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనే వారిపై వీరి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వారు అయితే ఆశతో ఈజీగా మోసపోతారని వారి నమ్మకం. ప్రేమ పేరుతో దగ్గరవ్వడం.. పెళ్లి వరకు తీసుకెళ్లడం.. ఆ తంతు అవ్వగానే ఫస్ట్ నైట్ రోజున మత్తు ముందు ఇచ్చి.. నగలు, డబ్బుతో ఉడాయించడం ఇది స్కెచ్. తెల్లారేసరికి.. కట్టుబట్టలు తప్ప ఇంట్లో ఏమి ఉండవ్.
వీరిది ఇంకో ప్లాన్ కూడా ఉంది… పెళ్లైన వారం రోజులు అత్తారింట్లో ఉంటుంది. ఆ తర్వాత కట్నం పేరుతో అత్తారింటివాళ్లు వేధిస్తున్నారంటూ బ్లాక్‌మెయిల్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతుంది సదరు యువతి. ఈ గ్రూపులో ఓ మ్యారేజ్ ఏజెంట్ భిజేంద్ర సింగ్ సహా ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
బండారం ఇలా బయపడింది….
సదరు యువతి పెళ్లి చేసుకున్న భర్తల్లో నాలుగో వ్యక్తి రాజేందర్ నౌల్తాలో నివశించేవాడు. మ్యారేజ్ అవ్వగానే.. రాజేందర్‌ను మాయ చేసి డబ్బులు, నగలతో పారిపోయింది. దీంతో మోసాన్ని గమనించి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆధారాలతో ఆ యువతి పెళ్లి చేసుకున్న ఐదో వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. వారు ఆమె మోసాన్ని అర్థం చేసుకునేలోపే శనివారం ఏడో వివాహం కూడా ఆమె కానిచ్చింది. 4వ భర్త, 5వ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆ యువతిని, ఆమె బ్యాచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు తల్లిదండ్రులు లేరని చెప్పి.. ఆధారాలు దొరక్కుండా ఆమె మోసం చేసేదని పోలీసులు తెలిపారు.
Also Read: Viral: ఆన్లైన్ గేమ్స్ ఆడి.. ఆడి మతి పోయింది.. రోడ్డుపైకి వెళ్లి వింత అరుపులు.. చివరకు ఇలా..