Telangana Lockdown: లాక్‌డౌన్‌లో ఊరి బ‌య‌ట సీక్రెట్‌గా మందు సిట్టింగ్.. లాఠీల‌తో స్పాట్‌కు పోలీసులు.. అస‌లు ఎలా తెలిసిందంటే..

|

May 26, 2021 | 9:46 PM

ఓవైపు కరోనా వైరస్‌ విజృంభణ. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతన్న లాక్‌డౌన్‌.. పనిలేదు. కాలక్షేపానికైన సరే రోడ్డేక్కే పరిస్థితి అంతకన్నా లేదు. ఇక పల్లెల్లోనూ...

Telangana Lockdown: లాక్‌డౌన్‌లో ఊరి బ‌య‌ట సీక్రెట్‌గా మందు సిట్టింగ్.. లాఠీల‌తో స్పాట్‌కు పోలీసులు.. అస‌లు ఎలా తెలిసిందంటే..
Party In Lockdown
Follow us on

ఓవైపు కరోనా వైరస్‌ విజృంభణ. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతన్న లాక్‌డౌన్‌.. పనిలేదు. కాలక్షేపానికైన సరే రోడ్డేక్కే పరిస్థితి అంతకన్నా లేదు. ఇక పల్లెల్లోనూ కరోనా కట్టడి కోసం పోలీసులు కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కానీ మందుబాబులకు మాత్రం ఈ కాలం కలిసొచ్చింది. తెల్లవారింది మొదలు ప్రశాంత ప్రదేశాలను ఎంచుకుని  మందు పార్టీలు చేసుకుంటున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మందుబాబుల ఆటకట్టించారు పోలీసులు. మూడు బీర్లు.. ఒక కోటర్… పక్కనే వాటర్ బాటిల్ కూడా…హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం సగం మందుపార్టీ ముగిసినట్టుంది. కానీ అంతలో పోలీసులు రానే వచ్చారు. తాగింది చాలుగాని, పదండి… పదండి అంటూ లాఠీ ఝళిపించారు. బహిరంగ ప్రదేశాలలో మందు తాగుతున్నారంటూ అదుపులోకి తీసుకున్నారు. బారు జోలికి వెళ్లకుండా, ఊరికి దూరంగా, ఎక్కడో చిట్టడవిలాంటి ప్రదేశంలో మందు కొడుతుంటే ఈ పోలీసులకు ఎలా తెలిసిందబ్బా అని ఆశ్చర్యపోవడం మందుబాబుల వంతైంది. ఈ సీన్‌ మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఇంతకీ అసలు సంగతేంటంటే… పోలీస్ ఇన్ఫార్మార్‌ ఇచ్చిన సమాచారంతో వీళ్ళ తాగుడు బాగోతం కళ్ళకు కట్టినట్లు కనబడింది. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న తమను ఎవరు చూడటం లేదని వీళ్ళు భావించినట్లున్నారు. కానీ ఓ ఇన్ఫార్మర్ వీళ్ళ సీన్ మొత్తం చిత్రీకరించి కొత్తగూడ పోలీసులకు చేరవేశారు. కొత్తగూడ మండలం కొత్తపల్లి సమీపంలో ఇలా మందు కొడుతున్న ముగ్గురినీ పోలీసులకు పట్టించారు. గూడూరు సిఐ రాజిరెడ్డి ముగ్గురు ఎస్సైలతో కలిసి సుమారు యాభై మంది సాయుధ పోలీసులతో గూడూరు పట్టణంలో బైక్ పై పర్యవేక్షించారు. పద్దతిగా ఉంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, పద్దతి తప్పితే శిక్ష తప్పదని హెచ్చరించారు.

Also Read: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా ఉన్నాయి

వచ్చే నెలలో ఏపీలో అమలు కానున్న పథకాలు ఇవే.. ప్రకటించిన సీఎం జ‌గ‌న్