Kadapa: వైఎస్ షర్మిల, సునీతలపై పోస్టులు పెట్టి ఇరుక్కుపోయాడు.. ఇంతకీ ఎవరితను..?

| Edited By: Balaraju Goud

Feb 14, 2024 | 6:14 PM

గత కొంత కాలంగా వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రముఖులపై తప్పుడు పోస్టులు చేస్తున్నారంటూ వర్రా రవీంద్ర రెడ్డి కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వైజాగ్ పట్టణం మహారాణి పేటకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్ ఈ పనికి ఒడిగడుతున్నట్లు గుర్తించారు.

Kadapa: వైఎస్ షర్మిల, సునీతలపై పోస్టులు పెట్టి ఇరుక్కుపోయాడు.. ఇంతకీ ఎవరితను..?
Indecent Posts On Ys Sharmila
Follow us on

పులివెందులకు చెందిన వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, సునీత రెడ్డిలపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో వర్రా రవీంద్రకు విశాఖపట్నంనకు చెందిన తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదయ్ భూషణ్‌కు మధ్య పోస్టుల విషయంలో చాటింగ్ జరిగింది. దీంతో వర్రా రవీంద్రను ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో షర్మిల, సునీత, విజయమ్మలపై అసభ్య పోస్టులు పెట్టేలా చేసిందని పోలీసుల విచారణలో తేలింది.

వైజాగ్ కు చెందిన ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టుల మధ్య వచ్చిన పంచాయతీ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్య పోస్టులు పెట్టే వరకు వెళ్లింది. అసలు విషయంలోకి వెళితే, గత కొంత కాలంగా వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రముఖులపై తప్పుడు పోస్టులు చేస్తున్నారంటూ వర్రా రవీంద్ర రెడ్డి కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వైజాగ్ పట్టణం మహారాణి పేటకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్ ఈ పనికి ఒడిగడుతున్నట్లు గుర్తించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో తప్పుడు పోస్టులు పెట్టి అతనిపై దుష్ర్పచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వర్ర రవీంద్రారెడ్డికి అలానే ఉదయ్ భూషణ్‌కు సోషల్ మీడియాలో జరిగిన వాగ్వావాదం వల్లే ఉదయ భూషణ్ వర్ర రవి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడని పోలీసులు తెలిపారు. అందులో వైయస్ షర్మిల, సునీత, విజయమ్మలపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అసభ్యకర పోస్టులపై సునీత హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. షర్మిల కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు.

అయితే ఆ పోస్టులు తాను పెట్టలేదని రవీంద్ర కడప జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో అసలు కథ బయటపడింది. దీంతో ఉదయ్ భూషణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు చేసినా సైబర్ నేరం కేసులు పెడతామని హెచ్చరించారు అడిషనల్ ఎస్పీ సుధాకర్. ఉదయ్ భూషణ్ వెనుక ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని క్రై మ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…