రెచ్చిపోయిన టోల్ సిబ్బంది… వాహనదారుడిపై కర్రలతో…
మధ్య ప్రదేశ్‌లో టోల్‌ప్లాజా సిబ్బంది రెచ్చిపోయారు. దివాస్‌లోని టోల్ ప్లాజాలో పనిచేసే ఉద్యోగులు ఓ వ్యక్తిని చితకబాదారు. కర్రలతో కారులో వ్యక్తులను చితక్కొట్టారు. టోల్ ఫీజ్ విషయంలో జరిగిన చిన్న గొడవ కాస్తా.. ఘర్షణకు దారితీసింది. టోల్‌ఫీజ్ విషయంలో సిబ్బందికి, కారులోని వ్యక్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన టోల్ ఉద్యోగులు వారిని చుట్టుముట్టారు. వారిపై చేయి చేసుకోవడంతో పాటు.. కొందరు కర్రలతో దాడిచేశారు. ఈ ఘర్షణ మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. దీనిపై […]
మధ్య ప్రదేశ్‌లో టోల్‌ప్లాజా సిబ్బంది రెచ్చిపోయారు. దివాస్‌లోని టోల్ ప్లాజాలో పనిచేసే ఉద్యోగులు ఓ వ్యక్తిని చితకబాదారు. కర్రలతో కారులో వ్యక్తులను చితక్కొట్టారు. టోల్ ఫీజ్ విషయంలో జరిగిన చిన్న గొడవ కాస్తా.. ఘర్షణకు దారితీసింది. టోల్‌ఫీజ్ విషయంలో సిబ్బందికి, కారులోని వ్యక్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన టోల్ ఉద్యోగులు వారిని చుట్టుముట్టారు. వారిపై చేయి చేసుకోవడంతో పాటు.. కొందరు కర్రలతో దాడిచేశారు. ఈ ఘర్షణ మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.