AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ‘హానీ ట్రాప్’.. రాజస్తాన్ లో ఇద్దరి అరెస్ట్ !

ఇండియాలో పాకిస్తానీ గూఢచార నెట్ వర్క్ పై ఉక్కుపాదం మోపిన మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు, రాజస్థాన్ పోలీసులు తమ రాష్ట్రంలో ఇద్దరు సివిల్ డిఫెన్స్ ఉద్యోగులను..

మరో 'హానీ ట్రాప్'.. రాజస్తాన్ లో ఇద్దరి అరెస్ట్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 08, 2020 | 6:32 PM

Share

ఇండియాలో పాకిస్తానీ గూఢచార నెట్ వర్క్ పై ఉక్కుపాదం మోపిన మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు, రాజస్థాన్ పోలీసులు తమ రాష్ట్రంలో ఇద్దరు సివిల్ డిఫెన్స్ ఉద్యోగులను అరెస్టు చేశారు. వీరిద్దరూ కీలకమైన భారత ఆర్మీ స్థావరాల గురించిన సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ కి చేరవేస్తున్నారట.. ‘ఆపరేషన్ డెజర్ట్’ లో భాగంగా పోలీసులు, సైనికవర్గాలు చేపట్టిన దర్యాప్తులో వీరు పట్టుబడ్డారు. ముల్తాన్ లోని పాకిస్తానీ మహిళా ఐఎస్ఐ సభ్యురాలొకరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని, ఆమెను ఈ ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరికి ‘ఎర’ గా వేశారని తెలిసింది. ఆమె ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ తెరచి.. తనను ఇండియాకు చెందిన ‘అనుష్క చోప్రా’ గా చెప్పుకుందని తెలిసింది.

ఈ కేసులో వికాస్ కుమార్, చిమన్ లాల్ అనే ఉద్యోగులను అరెస్టు చేశారు. వికాస్ సివిల్ డిఫెన్స్ ఆయుధ విభాగంలో పని చేస్తుండగా.. చిమన్ లాల్.. సైనిక్ మహాజన్ ఫీల్డింగ్ ఫైరింగ్ రేంజిలో సివిల్ కాంట్రాక్ట్ ఉద్యోగి అట.. వీరు డబ్బు కోసం పాకిస్తాన్ ఐఎస్ఐ కి గూఢచారులుగా పని చేస్తున్నట్టు వెల్లడైంది. వికాస్ కుమార్ ని ఇంటరాగేట్ చేయగా.. తన ఫేస్ బుక్ స్నేహితురాలు ఇండియన్ వాట్సాప్ నెంబర్ ని వినియోగించేదని, ముంబైలోని ఓ క్యాంటీన్ లో పని చేస్తున్నానని చెప్పుకునేదని తెలిపాడట. పాక్ నుంచి తనకు   75 వేల రూపాయలు ముట్టాయని, ఈ సొమ్ములో 9 వేలు చిమన్ లాల్ కి ఇచ్చానని వికాస్ చెప్పినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇతగాడు ఈ నెల మొదటివారం వరకు తరచూ పాక్ ఐఎస్ఐ కి సమాచారం పంపుతూ వచ్చా డని తెలిసింది.

Follow Us
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
'నా భార్యకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!'
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్ల ప్రకటన.. బయటపడ్డ 6 సంచలన విషయాలు
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఓటీటీలో రచ్చ ..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడు
పండక్కి ముందే బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. ఊహించని ట్విస్ట్
పండక్కి ముందే బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. ఊహించని ట్విస్ట్
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..