Bihar Minster son Opened Fire At Children: బీహార్ పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ ప్రసాద్ సాహ్ కుమారుడు బబ్లూ ప్రసాద్‌ను క్రికెట్ ఆడుతున్న అబ్బాయిలు చితకబాదారు. పండ్లతోటలో ఆడుకుంటున్న పిల్లలను తరిమికొట్టేందుకు కాల్పులు జరిపారని ఆరోపిస్తూ గ్రామస్థులు కొట్టారు. మంత్రి కుమారుడిని కొంతమంది వ్యక్తులు కొట్టినట్లు దృశ్యాలు చూపించాయి, వారు కాల్చిన తుపాకీని కూడా లాక్కున్నారు.అది కూడా మంత్రి నారాయణ్ ప్రసాద్ సాహ్ ఇల్లు ఉన్న పశ్చిమ చంపారన్ జిల్లా హార్దియా గ్రామంలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. మంత్రి కుమారుడిని ఆయన తోటలోనే, ఇతర కార్మికులను స్థానిక గ్రామస్థులు వెంబడించి కొట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… మంత్రి నారాయణప్రసాద్ సాహ్ తోటలో హార్ధియా గ్రామానికి చెందిన పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. దీంతో వారి వద్దని చెప్పేందుకు మంత్రి కుమారుడు బబ్లూ, ఇతర సిబ్బంది వెళ్ళినట్లు సమాచారం. ఇంతలో, ఇరువురి మధ్య మాట మాట పెరిగి తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దారి తీసింది. పిల్లలను భయపెట్టడానికి బబ్లూ.. తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారని, ఇది తొక్కిసలాటకు దారితీసిందని, ఒక చిన్నారితో సహా ఆరుగురు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్లు ముందుగా వారిని ఇటుకలతో కొట్టి పిస్టల్ లాక్కెళ్లారు. అయితే, ఈ ఘటన జరుగుతున్న సమయంలో మంత్రి నారాయణ్ ప్రసాద్ కూడా తన గ్రామమైన హర్దియాలో ఉన్నారు.
వివాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో మంత్రి కొడుకు కాల్పులు జరిపాడని చెబుతున్నారు. ఆ తర్వాత స్థానిక ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రి కొడుకు బబ్లూ, సిబ్బందిని గ్రామస్తులు చితక కొట్టారు. ఈ క్రమంలోనే మంత్రి కారును కూడా ధ్వంసం చేశారు. అయితే, కాల్పులు జరగలేదని, తన వాహనం ఉపయోగించలేదని మంత్రి నారాయణ్ ప్రసాద్ సాహ్ తెలిపారు. కానీ ఆయన కుమారుడు తోటలోకి వెళ్లిన వాహనంపై మంత్రి నేమ్ ప్లేట్ ఉంది.
నిజానికి, ఈ వివాదం హర్ధియా గ్రామంలో జరిగింది. మంత్రి నారాయణ్ సాహ్ ఒక మామిడి పండ్ల తోట ఉంది. మామిడి చెట్లకు పళ్లు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ కుర్రాళ్లు క్రికెట్ ఆడుతుంటే మామిడికాయలు పోతుందని బబ్లూ భావించాడు. ఈ కారణంగా, అతను క్రికెట్ ఆడటానికి నిరాకరించడానికి మంత్రి నేమ్ ప్లేట్ ఉన్న స్కార్పియోతో వెళ్లాడు. బబ్లూ స్వయంగా పిస్టల్‌తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో వివాదానికి కారణమైంది. మంత్రి నారాయణ్ సాహ్ కుమారుడు బబ్లూ ప్రసాద్‌ను క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్లు వెంబడించి పట్టుకుని తీవ్రంగా కొట్టారు.
Read Also…. UP Elections: బీజేపీ నేతృత్వంలోని NDA తరుఫున బరిలోకి దిగుతున్న మొదటి ముస్లిం అభ్యర్థి