Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారినుంచి 3 ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం రాత్రినుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
#UPDATE | Three terrorists neutralized in an encounter that broke out at the Zolwa Kralpora Chadoora area of Budgam. Identification & affiliation being ascertained. Incriminating materials including arms & ammunition recovered: IGP Kashmir pic.twitter.com/cNA303LTn3
— ANI (@ANI) January 7, 2022
One terrorist neutralised in an encounter that broke out at Zolwa Kralpora Chadoora area of Budgam. Operation is underway, details awaited: Kashmir Zone Police
— ANI (@ANI) January 7, 2022
Also Read: