AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తప్పిన పెను ప్రమాదం.. కంటైనర్ నుంచి కిందపడిన యంత్రాలు.. నుజ్జయిన కారు

Accident At Rajamundry: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై భారీ యంత్రాలతో వెళ్తున్న కంటైనర్‌

Watch Video: తప్పిన పెను ప్రమాదం.. కంటైనర్ నుంచి కిందపడిన యంత్రాలు.. నుజ్జయిన కారు
Accident
Shaik Madar Saheb
|

Updated on: Jan 07, 2022 | 9:32 AM

Share

Accident At Rajamundry: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై భారీ యంత్రాలతో వెళ్తున్న కంటైనర్‌ నుండి యంత్రాలు జారిపోయాయి. అవి కంటైనర్‌ వెనుక వస్తున్న కారుపై పడటంతో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. కారు డ్రైవర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిన్నపాటి గాయాలతో బయట పడిన కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా దివాన్‌ చెరువు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఒరిస్సా నుంచి చెన్నైకి కంటైనర్‌లో భారీ యంత్రాన్ని తీసుకెళ్తున్న సమయంలో వెనుకనుండి మరో లారీ కంటైనర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఊహించని ఈ ఘటనకు మిగాతా వాహనదారులు హడలిపోయి ఎక్కడివారక్కడే వాహనాలు నిలిపివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన బొమ్మూరు పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

వీడియో..

Also Read:

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికి నిద్రించాలి.. పరిశోధనలలో వెలుగు చూసిన కీలక అంశాలు..!

IPL 2022: హైదరాబాద్ వద్దంది.. బెంగళూరు ముద్దంది.. కోహ్లీ వారసుడిగా ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ ప్లేయర్?