Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..

One dead, five injured: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మాజీ సర్పంచ్‌ కుటుంబంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..
Crime News

Updated on: Nov 05, 2021 | 1:12 PM

One dead, five injured: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మాజీ సర్పంచ్‌ కుటుంబంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురుగ్రామ్‌లోని మనేసర్ ప్రాంతంలోని కసన్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మాజీ సర్పంచ్‌ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో దీపావళి పూజలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అందరిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా, 8 ఏళ్ల చిన్నారితోసహా మరో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను రక్షించే ప్రయత్నంలో పెంపుడు కుక్క కూడా కాల్పుల్లో గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Also Read:

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..