AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ఏళ్ల బాలికపై కామాందుల పైశాచికం! వివస్త్రను చేసి.. కళ్ళు పీకేసి, చెవులు, మెడపై..

ఒడిశాలోని అంగుల్ జిల్లాలో 11 ఏళ్ల బాలిక మృతదేహం కాలువలో లభ్యం అయింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. బాలిక శరీరంపై లోతైన గాయాలు కనిపించాయి. దీని కారణంగా బాలిక పై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఫిర్యాదు తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

11 ఏళ్ల బాలికపై కామాందుల పైశాచికం! వివస్త్రను చేసి.. కళ్ళు పీకేసి, చెవులు, మెడపై..
Odisha Road Blocked
Surya Kala
|

Updated on: Sep 08, 2025 | 9:46 AM

Share

ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ కాలువలో 11 ఏళ్ల బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. ఆ బాలిక నగ్నంగా ఉంది. శరీరంపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ కారణంగా ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించారు.

ఈ సంఘటన జిల్లాలోని శ్యామ్‌సుందర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం 5వ తరగతి చదువుతున్న ఈ బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం రాత్రంతా వెతికారు. అయినా ఆమె కనిపించలేదు. దీని తరువాత వారు అంగుల్ సదర్ పోలీస్ స్టేషన్‌లో బాలిక మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం గ్రామంలోని ఒక మురుగు కాలువలో బాలిక మృతదేహం కనుగొనబడింది. ఆ తర్వాత ఈ వార్త అక్కడ దావానంలా వ్యాపించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అంగుల్ ఎస్పీ రాహుల్ జైన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలంలో ఉన్నాయి, వారు సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ‘అసహజ మరణం’ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

బాలిక శరీరంపై గాయాల గుర్తులు మృతురాలి శరీరంపై మెడ, చెవులు, కళ్ల దగ్గర లోతైన గాయాల గుర్తులు ఉన్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. చెవులు తెగిపోయి, కళ్లు పీకినట్లు ఉన్నాయని.. ఇవన్నీ చూసి బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

రోడ్డును దిగ్బంధించిన గ్రామస్తులు బాలిక మృత దేహం చూసిన వెంటనే ఆగ్రహించిన గ్రామస్తులు వెంటనే షబల్‌భంగాకు వెళ్లే రహదారిని దిగ్బంధించారు. దీనితో అంగుల్ , బంటల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ప్రజలను శాంతింపజేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు ‘మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని అంగుల్ ఎస్పీ రాహుల్ జైన్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్, పోలీసు బృందం సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలిక కోసం వెదికిన తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.’

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.