Criminal Encounter: గోగా గ్యాంగ్‌కు చెందిన పేరుమోసిన నేరగాడు కుల్‌దీప్ పజ్జా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆదివారం స్పెషల్ సెల్ టీమ్ పోలీసులు అతన్ని కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే కుల్‌దీప్ హతం కావడం గమనార్హం. మార్చి 25వ తేదీన కుల్ దీప్ వైద్య సహాయం నిమిత్తం జీబీటీ ఆస్పత్రికి వచ్చాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడానికి ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కుల్‌దీప్ గ్యాంగ్ పోలీసులపై కారంపొడి చల్లి కాల్పులకు తెగబడింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. అనుచరుల సహాయంతో అతడు తప్పించుకున్నాడు.
కుల్‌దీప్ గ్యాంగ్‌లోని ఓ దుండగుడు మృతి చెందాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు రోహిణీలోని ఓ ప్లాట్‌లో తలదాచుకున్నాడు. ఇక ఆ నేరగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడిని ట్రాక్ చేసి బిల్డింగ్‌ను చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో లెక్క చేయని కుల్‌దీప్ పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా అతడిపై ఎదురు కాల్పులు జరపడంతో కుల్‌దీప్ హతమయ్యాడు. కాగా, గత మార్చి నెలలో ఢిల్లీకి చెందిన ప్రత్యేక సెల్ పోలీసులు అతడిని గురుగావ్‌లో అరెస్టు చేశారు.
బయటకు వచ్చిన తర్వాత కూడా అతడు తన పంధా మార్చకుండా నేరాలకు పాల్పడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకున్న72 గంటల్లోనే కాల్చి చంపారు.
ఇవీ చదవండి: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఓ జవానుతో సహా ఇద్దరు ఉగ్రవాదుల మృతి, కొనసాగుతున్న కూంబింగ్
ఇండోనేసియాలోని చర్చిని టార్గెట్ చేసిన సూసైడ్ బాంబర్లు, అనేకమందికి గాయాలు