Realtor Family Suicide Case: నిజామాబాద్‌ ఫ్యామిలీ సుసైడ్‌ కేసు దర్యాప్తు వేగవంతం.. పోలీసుల పరిశీలనలో విస్తూపోయే నిజాలు

|

Aug 23, 2022 | 9:50 PM

Realtor Family Suicide Case: నిజామాబాద్ లో ఫ్యామిలితో స‌హ సూసైడ్ చేసుకున్న రియ‌ల్టర్ సూర్యప్రకాశ్ కేసులో ద‌ర్యాప్తు ను స్పీడప్ చేశారు పోలిసులు...ఇప్పటికే సూసైడ్..

Realtor Family Suicide Case: నిజామాబాద్‌ ఫ్యామిలీ సుసైడ్‌ కేసు దర్యాప్తు వేగవంతం.. పోలీసుల పరిశీలనలో విస్తూపోయే నిజాలు
Family Suicide Case
Follow us on

Realtor Family Suicide Case: నిజామాబాద్ లో ఫ్యామిలితో స‌హ సూసైడ్ చేసుకున్న రియ‌ల్టర్ సూర్యప్రకాశ్ కేసులో ద‌ర్యాప్తు ను స్పీడప్ చేశారు పోలిసులు.. ఇప్పటికే సూసైడ్ లెట‌ర్ ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించారు. ద‌ర్యాప్తులో భాగంగా ప‌లు కీల‌క విష‌యాలు పోలీసులు గుర్తించారు. ముగ్గురు పార్టనర్ల వేధింపుల వ‌ల్లనే తాను సూసైడ్ కు పాల్పడ్డాన‌ని లేఖలో పేర్కొన‌డంతో పాటుగా వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కోరారు. ఇక అటు ఓ పోలీసు అధికారి బంధువు పేరు చెప్పి బెదిరించినట్లుగా బందువులు ఆరోపిస్తుండంటంతో ఆ కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేపడుతున్నారు.

ఈరియల్టర్ కుటుంబం బలవన్మరణ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఆదివారం నిజామాబాద్‌లోని ఓ హోటల్లో భార్య, పిల్లలు సహా.. సూర్యప్రకాశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఈయనకు భాగస్వా ములతో కొన్నిరోజులుగా విబేధాలు వచ్చాయి. 20 రోజుల కిందట కొందరు దాడి చేశారు. తనకు జరుగుతున్న అవమానాలు. ఒత్తిళ్లను తాళలేకనే కుటుంబమంతా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగానే నిజామాబాద్ కు వ‌చ్చి బ‌లవ‌న్మరణానికి పాల్పడ్డట్లు గుర్తించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సూర్యప్రకాశ్ భాగస్వాములైన వెంకట్ సందీప్, కళ్యాణ చక్రవర్తి, కిరణ్ పై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు హైదరాబాద్‌కు, మరొకరు విశాఖపట్నానికి చెందినవారని గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల బృందం సోమవారం హైదరాబాద్ వెళ్లింది. నిందితుల్లో ఒకరికి పోలీసు అధికారితో సంబంధాలున్నాయని బంధువులు ఆరోపించారు. ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది..? సదరు వ్యక్తులు ఎవరు..? బెదిరింపు విషయంలో సదరు అధికారి పాత్ర ఉందా..? అని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది

ఇవి కూడా చదవండి

అయితే సూర్య ప్రకాష్‌పై దాడి జరిగిన విషయం బంధువులు, డ్రైవర్ చెబుతున్నారు. పోలీసులు సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇల్లు, రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద నెల రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజీ సేకరించే పనిలో ఉన్నారు. 15 రోజుల నుంచి ఈ కుటుంబం హైదరాబాద్‌లో లేకపోవటంతో ఎవరెవరు ఇంటికి, కార్యాలయానికి వచ్చి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సూర్యప్రకాశ్ ఫోన్ చనిపోయే వరకు ఆన్‌లోనే ఉంది. ఆయనకు వచ్చిన ఫోన్లు చాలా వరకు లిఫ్ట్ చేయ లేదని గుర్తించారు. ఇక మొత్తం మీద ఇప్పుడు నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి