Gupta Nidhulu: ధనవంతులుగా మారాలా.. ఈ గుప్తనిధులను సోంతం చేసుకోండి.. మాటలు చెప్పే మాంత్రికులకు మోత మోగింది

|

Aug 08, 2021 | 10:10 AM

అమాయకులు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు.. అయితే వారి ముసుగు తొలగించినపుడే అసలు స్వరూపం బయట పడుతుంది. గుప్తనిధులు పేరుతో మోసం చేయాలని చూసిన ఓ చీటర్ ని చితకబాదారు. ఏదో ఒక చోట...

Gupta Nidhulu: ధనవంతులుగా మారాలా.. ఈ గుప్తనిధులను సోంతం చేసుకోండి.. మాటలు చెప్పే మాంత్రికులకు మోత మోగింది
Gupta Nidhulu
Follow us on

అమాయకులు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు.. అయితే వారి ముసుగు తొలగించినపుడే అసలు స్వరూపం బయట పడుతుంది. గుప్తనిధులు పేరుతో మోసం చేయాలని చూసిన ఓ చీటర్ ని చితకబాదారు. ఏదో ఒక చోట గుప్త నిధులు బయటపడిపోయాయని, అన్ని చోట్లా గుప్త నిధులు ఉంటాయనుకోవడం భ్రమా.. అయితే జనాల్లో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకుని చాలా చోట్ల గుప్త నిధుల పేరుతో చీటింగ్‌ చేస్తున్నారు మోసగాళ్లు. మీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని, అక్కడ తవ్వితే మీ దరిద్రం పోయి ధనవంతులుగా మారవచ్చని నమ్మ బలుకుతున్నారు. అయితే కొందరు మోసపోతుండగా, మరికొందరు మాత్రం త్వరగానే మేల్కొంటున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.

నిర్మల్ జిల్లా కేంద్రం లోని YSRనగర్ కాలనీలో గుప్తనిధులు వెలికి తీస్తానంటూ ఓ వ్యక్తి స్థానికులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి మోసాన్ని ముందుగానే పసిగట్టిన స్థానికులు చితకబాదారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలో నివాసముండే మహారాష్ట్రకు చెందిన సైదారావు ఫాల్గురీ అనే వ్యక్తి నిర్మల్‌లో కొందరిని చీటింగ్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

గుప్తనిధులను వెలికితీస్తానని చాలా మందిని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే గుప్తనిధుల పేరుతో డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గమనించిన స్థానికులు అతడిని చితక్కొట్టారు. రోడ్డు మీద అంతా చూస్తుండగానే చితకబాదారు. మరోసారి ఎవరినైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే ఇంత కంటే భారీ స్థాయిలో దేహశుద్ది జరుగుతుందని వార్నింగ్‌ ఇచ్చారు.

ఆ తర్వాత చీటర్‌ సైదారావు ఫాల్గురీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు . నిర్మల్‌లోని వైఎస్‌ఆర్‌నగర్‌ కాలనీలో జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. గుప్తనిధుల పేరుతో మళ్లీ ఎవరైనా వచ్చి నమ్మించినా జనం మోసపోవద్దని పోలీసులు, ప్రజలకు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Ananta Sriram: గేయ రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే..

Hyderabad: పీఎఫ్‌ పేరుతో మోసం.. రూ.9లక్షలు కాజేసిన కేటుగాళ్లు

‘అరె భాయ్..! నా పేరిట 20 శాతం డిస్కౌంట్ ఇవ్వు.. చెప్పులమ్మే సెల్లర్ తో సోను సూద్ ‘బేరం’ !