Murder mystery: నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ మర్డర్ కేసు మిస్టరీ బయటపెట్టిన పోలీసులు

నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ హత్యోదంతాన్ని నవాబ్ పేట పోలీసులు ఎట్టకేలకు చేధించారు...

Murder mystery: నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ మర్డర్ కేసు మిస్టరీ బయటపెట్టిన పోలీసులు
Nellore Sunil Murder Case

Updated on: Jul 08, 2021 | 4:25 PM

Nellore Sunil Murder Case: నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ హత్యోదంతాన్ని నవాబ్ పేట పోలీసులు ఎట్టకేలకు చేధించారు. పాత కక్షల నేపథ్యంలో సునీల్ బావమరిది రాజా తన స్నేహితులతో కలిసి సునీల్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు నగర డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి.. సునీల్ మర్డర్ కేసుకు సంబంధించి ఇవాళ మీడియాకి వివరాలు వెల్లడించారు.

పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. నెల్లూరుకి చెందిన సునీల్‌కి శైలజ అనే యువతితో 15 ఏళ్ల క్రితం వివహమైంది. అయితే, గత కొంత కాలంగా సునీల్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి.. భార్య శైలజను శారీరకంగా హింసిస్తుండటంతో శైలజ కుటుంబ సభ్యులు సునీల్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అయితే, ఇకపై.. తన భార్య శైలజను ఎలాంటి ఇబ్బందులు పెట్టనని సునీల్.. శైలజ కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ సునీల్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శైలజ అన్నయ్య రాజా మరో ఇద్దరితో కలిసి సునీల్ ను హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

Read also: Pawan kalyan – Sharmila Party: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీపై జనసేనాని రియాక్షన్