Ramya Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను నడిరోడ్డుపై హత్య చేసిన సంఘటనపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితుడు శశికృష్ణను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ క్రమంలో విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రమ్య మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. దీంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రమ్య కుటుంబాన్ని పరామర్శించారు. పరమాయికుంటకు చేరుకుని లోకేష్.. రమ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి.. ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేంత వరకు పోరాడుతామని లోకేష్ పేర్కొన్నారు.
కాగా.. రమ్య హత్య ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ఆదివారం.. ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా.. రమ్యని చంపేసిన 12 గంటల తర్వాత బాధాకరం అంటూ ట్వీట్ చేశారు’ అంటూ వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిద్ర మొఖం పాలనలో ఎంతమంది అమ్మాయిలను బలి చేస్తారు’ అంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్విట్‌కు రీట్విట్ చేశారు.
ఇదిలాఉంటే.. రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రికత్త నెలకొంది. వాహనాన్ని అడ్డుకుని పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. కాగా.. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మృతదేహాన్ని మరో మార్గం నుంచి స్వగ్రామానికి తరలించారు.
Also Read: