Rahul Murder: తాడు వేసి బిగించిందొకరు.. దిండుతో అదిమిపట్టిందొకరు.. రాహుల్ మర్డర్‌ కేసులో వీడుతున్న మిస్టరీ..

|

Aug 24, 2021 | 12:32 PM

విజయవాడలో రాహుల్ మర్డర్‌ మిస్టరీ దాదాపు వీడిపోతోంది. పోలీసుల నుంచి వస్తున్న సమాచారం చూస్తుంటే కేసుపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తున్నట్లే ఉంది. ఈ కేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులో..

Rahul Murder: తాడు వేసి బిగించిందొకరు.. దిండుతో అదిమిపట్టిందొకరు.. రాహుల్ మర్డర్‌ కేసులో వీడుతున్న మిస్టరీ..
Rahul
Follow us on

విజయవాడలో రాహుల్ మర్డర్‌ మిస్టరీ దాదాపు వీడిపోతోంది. పోలీసుల నుంచి వస్తున్న సమాచారం చూస్తుంటే కేసుపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తున్నట్లే ఉంది. ఈ కేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న విజయ్‌.. మర్డర్‌కి సంబంధించిన మొత్తం విషయం కక్కేస్తున్నాడు. రాహుల్‌ హత్య సమయంలో కారులో విజయ్‌తోపాటు సీతయ్య, బాబూరావు అనే వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్లలో సీతయ్య అనే వ్యక్తి రాహుల్‌ మెడకు తాడు వేసి బిగిస్తే, విజయ్‌ దిండుతో అదిమి ఊపిరాడకుండా చేశాడు. హత్య తర్వాత అందరూ పారిపోయారు.

మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి రాహుల్, గాయత్రికి మాటిచ్చాడు. ఆరు కోట్లు వసూలు చేశాడు. కానీ సీటు రాలేదు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే మొదట 50లక్షలు ఇస్తానని చెప్పాడు రాహుల్‌. ఆ డబ్బు కోసమే గాయత్రి ఈ నెల 18 రాహుల్‌కు ఫోన్ చేసింది.

దాని గురించి మాట్లాడేందుకు ఇంట్లో చెప్పి రాహుల్ , గాయత్రి ఇంటికెళ్లాడు. అక్కిడికి వెళ్లగానే రాహుల్‌తో పాటు కారులోకి విజయ్‌, బాబురావు, సీతయ్య ఎక్కారు. డబ్బు తెచ్చావా అంటూ విజయ్ ప్రశ్నించాడు. మాట్లాడ్డానికి వచ్చాను అనేసరికి.. మాటా మాట పెరిగి గొడవ జరిగింది.

సీతయ్య తాడుతో మెడ బిగించాడు. విజయ్ దిండుతో అదిమాడు. అంతే క్షణాల్లో మర్డర్‌ జరిగింది. ఈ కేసులో ఇంకా తేలాల్సి ఉన్న విషయం మరో ముగ్గురు మహిళల పాత్ర.. వారి పారత్ర ఏంటో తేలాల్సి ఉంది. దీనిపైనే ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరింత సమాచారం వస్తే మర్డర్ కేసులో అసలు నిందితుడు ఎవరనేది తేలనుంది.

ఇవి కూడా చదవండి: TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు

HCU Student Suicide: ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. మిస్‌ యూ నాన్న..సెంట్రల్ యూనివర్సిటీలో PG స్టూడెంట్ మౌనిక సూసైడ్