నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది: జబర్దస్త్ వినోద్

| Edited By:

Jul 22, 2019 | 10:32 AM

తనకు, తన కుటుంబసభ్యులకి ప్రాణహాని ఉందని జబర్డస్త్ వినోద్ చెబుతున్నాడు. రెండ్రోజుల నుంచి ఇంటికి నీటి సరఫరా ఆపేశారని, ఇరుగు పొరుగు ఇళ్లనుంచి నీటిని అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. తనపై దాడి చేసిన వాళ్లు కళ్ల ఎదుటే తిరుగుతున్నా.. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని వినోద్ ఆరోపిస్తున్నాడు. ఇల్లు అమ్ముతామని తన వద్ద రూ. 10 లక్షలు తీసుకున్నారని ఇప్పుడు అడిగితే తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇస్తే ఇల్లు అయినా ఇవ్వాలని.. […]

నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది: జబర్దస్త్ వినోద్
Follow us on

తనకు, తన కుటుంబసభ్యులకి ప్రాణహాని ఉందని జబర్డస్త్ వినోద్ చెబుతున్నాడు. రెండ్రోజుల నుంచి ఇంటికి నీటి సరఫరా ఆపేశారని, ఇరుగు పొరుగు ఇళ్లనుంచి నీటిని అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. తనపై దాడి చేసిన వాళ్లు కళ్ల ఎదుటే తిరుగుతున్నా.. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని వినోద్ ఆరోపిస్తున్నాడు. ఇల్లు అమ్ముతామని తన వద్ద రూ. 10 లక్షలు తీసుకున్నారని ఇప్పుడు అడిగితే తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇస్తే ఇల్లు అయినా ఇవ్వాలని.. లేకపోతే తన డబ్బులైనా ఇవ్వాలని వినోద్ కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగే వరకూ ఇల్లు ఖాళీ చేయనని చెబుతున్నాడు.