వర్ధమాన సినీ సంగీత దర్శకుడిపై దాడి
ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో ఓ మ్యూజిక్ డైరక్టర్ ను చితకబాదారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.
ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో ఓ మ్యూజిక్ డైరక్టర్ ను చితకబాదారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు కలిసి వర్ధమాన సినీ సంగీత దర్శకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-63/ఏలో నివాసముండే అగస్త్య బోయలపల్లి సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడు. పలు చిన్న సినిమాలకు సంగీతం కూడా అందించాడు. గత నెల 9న అతడు ఇంట్లో ఉండగా చిట్టి నాగార్జునరెడ్డి, చిట్టి అనుషారెడ్డి, చిట్టి శ్రావ్యలు కలిసి అగస్త్య ఇంటిపై దాడి చేశారు. అగస్త్యపై ముగ్గురు కలిసి దాడి చేశారు. రెండు సెల్‌ఫోన్లను పగులకొట్టారు. అతన్ని తీవ్రంగా కొట్టడంతో వారి నుంచి తప్పించుకున్న అగస్త్య ఆస్పత్రిలో చేరాడు. కుడి చేయి విరగడంతో చికిత్స పూర్తయిన తర్వాత గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.