Crime News: రాజధానిలో దారుణం.. అప్పు చెల్లించాలన్నందుకు.. మహిళ గొంతు కోసిన దుర్మార్గుడు.. సీసీటీవీలో రికార్డు..

|

Oct 05, 2021 | 1:25 PM

Delhi Crime News: దేశరాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బు చెల్లించాలన్నందుకు కూరగాయల బండి పెట్టుకొని జీవనం సాగించే ఓ మహిళ (30)ను.. ఓ వ్యక్తి దారుణంగా గొంతుకోసి

Crime News: రాజధానిలో దారుణం.. అప్పు చెల్లించాలన్నందుకు.. మహిళ గొంతు కోసిన దుర్మార్గుడు.. సీసీటీవీలో రికార్డు..
Crime News
Follow us on

Delhi Crime News: దేశరాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బు చెల్లించాలన్నందుకు కూరగాయల బండి పెట్టుకొని జీవనం సాగించే ఓ మహిళ (30)ను.. ఓ వ్యక్తి దారుణంగా గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి ఢిల్లీలోని డాబ్రి ప్రాంతంలో రద్దీగా ఉండే రాజపురిలోని సోమ్ బజార్ మార్కెట్లో జరిగిందని.. దీనికి సంబంధించిన దిలీప్ అనే ప్లంబర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. రాజపురిలోని సోమ్ బజార్ రోడ్డులో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో చిన్న కూరగాయల షాప్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అతని దగ్గర దిలీప్‌ అనే వ్యక్తి అప్పుగా సరుకులు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. అప్పు చెల్లించాలని ఆ మహిళ ప్రశ్నించడంతో ఆ వ్యక్తి కత్తితో ఆమె గొంతుకోసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షాపు దగ్గర గొడవ జరిగిన అనంతరం నిందితుడు సదరు మహిళ దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె చీపురు చూపించి బెదిరించింది. ఈక్రమంలో తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. కత్తి తీసి మహిళపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని.. మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని విభ (30)గా పోలీసులు గుర్తించారు.

నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని తీవ్రంగా కొట్టారు. తాగిన మైకంలో కిరాణా షాపు నడుతున్న విభ, ఆమె భర్తతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులను అడ్డుకుని.. నిందితుడిని అప్పగించమంటూ గొడవకు దిగారు. రాళ్లు సైతం పోలీసులపై రువ్వారు. స్థానికుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. పోలీసులపై దాడి చేసి విధులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Viral Video: మంచు కురిసే వేళలో.. తెగ ఎంజాయ్‌ చేసిన పిల్ల ఎలుగుబంటి.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. వీడియో

Viral Video: కారు వేగంగా వెళ్తుండగా బానట్‌పై పడిన పాము.. బిత్తర పోయిన డ్రైవర్.. ఏం చేశాడంటే..