Mumbai vaccination Scam: మహారాష్ట్ర రాజధాని ముంబై కందివాలి ప్రాంతంలోని హిరానందాని ఎస్టెట్ హౌసింగ్ సొసైటీ నివాసితులను నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో మోసగించిన నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీకా శిబిరాలను నిర్వహించే మహేంద్ర సింగ్, ధృవపత్రాల కోసం నకిలీ డేటా సేకరించే చందన్ సింగ్, నితిన్ మోండేతోపాటు టీకా క్యాంపుల్లో పాల్గొనే సంజయ్ గుప్తా అరెస్టైన వారిలో ఉన్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. అయితే.. వీరంతా హీరానందాని సొసైటీకి చెందిన 390 మందికి ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లు అధికారికంగా కొనుగోలు చేయలేదని పోలీసులు వెల్లడించారు.
హౌసింగ్ సొసైటీ సభ్యులకు మే 30న నిర్వహించిన కరోనా టీకా డ్రైవ్‌నకు సంబంధించి నిర్వాహకులు బీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని ఏపీసీ (నార్త్) దిలీప్ సావంత్ పేర్కొన్నారు. నిందితులు నకిలీ ధృవీకరణ పత్రాలను రూపొందించడానికి ప్రైవేట్ ఆసుపత్రుల కోవిన్ ఐడీలు దొంగిలించారని తెలిపారు. ఈ బృందం ఇప్పటి వరకు ఇలాంటి తొమ్మిది శిబిరాలను నిర్వహించిందని వెల్లడించారు. బీఎంసీ సహాయంతో టీకా ప్రామాణికతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
హిరానాందానీ ఎస్టేట్ సొసైటీలో మే 30న సుమారు 390 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను తీసుకున్నారు. అయితే.. డోసుకు రూ.1,260 చొప్పున రూ.5లక్షలు చెల్లించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. తాము టీకా తీసుకున్నట్లు ఎలాంటి మెస్సెజ్‌లు రాకపోవడంతో వారంతా పోలీసులను సంప్రదించారు.
Also Read: