Covid-19 Fake Report: భార్య నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్.. కరోనా ఫేక్‌ రిపోర్ట్‌‌తో వేషాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

|

Jul 06, 2021 | 7:44 AM

MP Man Forges Covid-19 Report: దేశంలో కరోనా విలయతాండవం సృష్టించి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం.. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి.. మహమ్మారి సోకిన వారు

Covid-19 Fake Report: భార్య నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్.. కరోనా ఫేక్‌ రిపోర్ట్‌‌తో వేషాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Covid Cases
Follow us on

MP Man Forges Covid-19 Report: దేశంలో కరోనా విలయతాండవం సృష్టించి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం.. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి.. మహమ్మారి సోకిన వారు దాదాపు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నిబంధనలను ఆసరాగా చేసుకొని.. కొందరు వ్యక్తులు సెలవుల కోసం.. పని ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి.. ఇంకా పలు అవసరాల కోసం ఫేక్ కోవిడ్ సర్టిఫికెట్లతో అడ్డంగా బుక్కయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి తన భార్య నుంచి దూరంగా ఉండాలనుకున్నాడు. అనంతరం ఫేక్ కోవిడ్ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. ఆసుపత్రిలో క్వారంటైన్‌లో ఉన్నానంటూ నమ్మబలికాడు. నెల అయినా అతను రాకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో.. అతని బాగోతం మొత్తం బయటపడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ సమీపంలోని మోవ్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌ సమీపంలోని ఎంటౌన్ జిల్లాకు చెందిన ఎజాజ్ అహ్మద్ వ్యాపారవేత్త. ఫిబ్రవరిలో ఇదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఈ క్రమంలో అతనికి భార్య, ఇంట్లోవారితో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైనా ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. ఇలా చేసేందుకు వ్యూహం రచించాడు. గూగుల్ తల్లిని ఆశ్రయించాడు. నెట్టింట ఒక ప్రైవేటు ల్యాబ్‌ నుంచి కోవిడ్‌ సోకిన వ్యక్తి రిపోర్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అనంతరం దానిపై అతని పేరును మార్చి, తన పేరు, వివరాలను పెట్టుకున్నాడు. ఆ తర్వాత.. ఫేక్ రిపోర్ట్‌ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్‌ చేశాడు. క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

నెల అయినా ఎజాజ్ రాకపోవడంతో.. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి.. ఎజాజ్ భార్య, తల్లిదండ్రులు వెంటనే ఆ వాట్సప్‌లో ఉన్న ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి సంప్రదించారు. అప్పుడు వారికి ఎజాజ్ చేసిన మోసం బయటపడింది. ఇందంతా తెలుసుకున్న ల్యాబ్ నిర్వహకులు.. తమ ల్యాబ్‌ రిపోర్ట్‌ను ఫోర్జరీతో మార్పిడి చేసినందుకుగాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్వల్టోలి పోలీసులు ఎజాజ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Tribal Sisters: అమానుషం.. ఫోన్‌లో మాట్లాడుతున్నారాని అక్కాచెల్లెళ్లను కర్రలతో చితకబాదిన కుటుంబ సభ్యులు.

Nellore Boy Missing: ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో.. పాపం సంజు! నాన్న అడుగులో అడుగేస్తూ వెళ్లిన చిన్నోడు కనిపించకుండా పోయాడు..!