అతనో మోటివేషనల్ స్పీకర్.. చేసింది తెలిస్తే మాత్రం షాక్ అవడం పక్కా

|

Feb 19, 2022 | 9:19 AM

అతనో మోటివేషనల్ స్పీకర్(Motivational speaker). జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఏమేమి చేయాలి వంటి విషయాలపై అవగాహన కలిగిస్తుంటాడు. ఇలా ఆత్మస్థైర్యాన్ని నింపే వ్యక్తి..

అతనో మోటివేషనల్ స్పీకర్.. చేసింది తెలిస్తే మాత్రం షాక్ అవడం పక్కా
Cripto
Follow us on

అతనో మోటివేషనల్ స్పీకర్(Motivational speaker). జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఏమేమి చేయాలి వంటి విషయాలపై అవగాహన కలిగిస్తుంటాడు. ఇలా ఆత్మస్థైర్యాన్ని నింపే వ్యక్తి సైబర్(Cyber) దొంగగా మారాడు. క్రిప్టో కరెన్సీ(Crifto currency) కొని తన ఖాతాకు బదిలీచేస్తే పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తానని నమ్మించాడు. తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన వారి నుంచి నగదు తీసుకుని ఉడాయించాడు. రూ.కోట్లు కొల్లగొట్టి అమెరికాకు చెక్కేశాడు. అతనికి సహకరించిన ఆయన తండ్రి కూడా పారిపోయే ప్రయత్నంలో ఉండగా హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయికి చెందిన హర్షల్‌ పటేల్‌ మోటివేషనల్‌ స్పీకర్‌. అవగాహన సదస్సుల్లో కొంతకాలంగా క్రిప్టో కరెన్సీ గురించి చెప్పేవాడు. రూ.లక్షల్లో క్రిప్టో కొంటే రూ.కోట్లలో లాభాలు వచ్చేలా చూస్తానని నమ్మించేవాడు. తన మాటలు నమ్మిన వారితో క్రిప్టో కరెన్సీ కొనిపించి, తన ఖాతాకు బదిలీ చేయించుకునేవాడు. ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాల వారి నుంచి రూ.కోట్లు కొల్లగొట్టాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ ఒకరి నుంచి రూ.8 లక్షలు కాజేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒకరి నుంచి రూ.60 లక్షలు, మరొకరి నుంచి రూ.30 లక్షలు కాజేసినట్టు విచారణలో గుర్తించారు. బాధితుల వద్ద డబ్బు వసూలు చేసిన అనంతరం.. హర్షల్‌ పటేల్‌ అమెరికా పారిపోయినట్లు వివరించారు. నిందితుడి తండ్రి మదన్‌గీర్‌ పంజాబ్‌లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లారు. ఆయన కూడా అమెరికాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఎయిర్ పోర్టులో శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Also Read

వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్‌ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో

Singareni news: సింగరేణి కార్మికులకు రూ.40 లక్షలు బీమా.. వేతనం, హోదాకు సంబంధం లేకుండా..

TTD: తిరుమల కొండపై ప్రైవేటు ఫుడ్‌ వ్యవస్థ నియంత్రణ సాధ్యమేనా..? టీటీడీ నిర్ణయం సక్సెస్‌ అయ్యేనా..?