Minor girl suicide : సెల్‌ఫోన్ విషయంలో స్నేహితులతో గొడవ.. తల్లి మందలిస్తుందని బాలిక ఆత్మహత్య

|

Jan 23, 2021 | 9:52 PM

హైదరాబాద్ మహానగరంలో ఓ బాలిక సెల్‌ఫోన్ కోసం ఫ్రెండ్‌తో గొడవపడి బలవన్మరణానికి పాల్పడింది.

Minor girl suicide : సెల్‌ఫోన్ విషయంలో స్నేహితులతో గొడవ.. తల్లి మందలిస్తుందని బాలిక ఆత్మహత్య
suicide
Follow us on

Minor girl commits suicide : సెల్‌ఫోన్లు మనిషి జీవితంలో భాగంగా మారిపోయాయి. మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు నిండు ప్రాణాలను బలి తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఓ బాలిక సెల్‌ఫోన్ కోసం ఫ్రెండ్‌తో గొడవపడి బలవన్మరణానికి పాల్పడింది. సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

మియాపూర్ ప్రాంతంలోని న్యూ కాలనీలో నివసముంటున్న సంగీత పెద్ద కూతురు అనిత మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే తన ఫ్రెండ్‌తో సెల్‌ఫోన్ విషయంలో గొడవ పడింది. ఈ విషయం తల్లికి తెలిస్తే మందలిస్తుందన్న భయంతో.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యలు బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also… జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమించిన యువతి ఆత్మహత్య.. తీవ్ర మనస్తాపంతో దుబాయ్‌లో యువకుడి బలవన్మరణం