Hyderabad: వెలుగులోకి సీఐ నాగేశ్వరరావు కథలు.. సీసీ కెమెరాలో బాధితులను తీసుకువెళ్తున్న దృశ్యాలు
Marredpally CI: అడ్డొస్తే అంతం చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇతడే సిఐ నాగేశ్వరరావు..ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.. నాగేశ్వరరావు ఎంత ఖతర్నాకో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు చెబుతున్నాయి.
ఖాకీల ముసుగులో కాలనాగులు కాటేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డొస్తే అంతం చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇతడే సిఐ నాగేశ్వరరావు..ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.. నాగేశ్వరరావు ఎంత ఖతర్నాకో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు చెబుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసిన రోజు నాగేశ్వరరావు నైట్ డ్యూటీలో ఉన్నాడు. విచారణకు సహకరిస్తానని చెప్పడంతో నమ్మిన పోలీసులు లెటర్ రాయించుకుని పంపించారు. సిటీలోనే ఉంటే ఆధారాలు బయటకొచ్చి తాను అడ్డంగా బుక్కవుతానని గ్రహించిన నాగేశ్వరరావు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు కూడా అతడిని వెంటాడుతున్నారు. సెల్ టవర్ లొకేషన్స్ సేకరించి..నాగేశ్వరరావు ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు. మరోవైపు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించారు. బాధిత దంపతులను నాగేశ్వరరావు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో.. సిఐ నాగేశ్వరరావు తప్పించుకోలేడని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు, నాగేశ్వరరావు కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. నాగేశ్వరరావు ఆగడాలన్నీ ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి. అతడి వల్ల ఎంతమంది నరకయాతన పడ్డారో వాళ్లంతా ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలంటూ.. నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలంటూ.. వనస్థలిపురం ఏసీపీ ఆఫీస్ ముందు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిఐ నాగేశ్వరరావు ప్లాష్‌బ్యాక్ రికార్డ్స్ మామూలుగా లేవు. తవ్వేకొద్దీ ఆయన ఘనకార్యాలు బయటపడుతున్నాయి. బంజారాహిల్స్‌లోని ఓ ల్యాండ్ కేసులో తన మార్క్ చూపించాడు. సార్ ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే.. ఈ మేటర్‌లో హైకోర్టు ఆదేశాలను కూడా డోన్ట్‌కేర్ అని రెచ్చిపోయాడు. అంతేనా.. మరో కేసులో సీజ్ చేసిన బిఎండబ్ల్యూ కారును టాస్క్ ఫోర్స్ కార్యాలయం లో తన కస్టడీ లోనే పెట్టుకున్నాడు. కారు యజమాని ఎంత బతిమాలినా.. నాగేశ్వరరావు దయ చూపలేదు.. ఇలాంటివి ఎన్నో నాగేశ్వరరావు ట్రాక్ రికార్డులో ఉన్నాయంటూ పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనే కొందరు గుసగుసలాడుకుంటున్నారు.