Man Kills Sister: ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. ఉత్తరప్రదేశ్‌లో దారుణాలు ఆగడం లేదు. పరువు, ప్రతిష్ట అంటూ.. చదువుకున్న వాళ్లు సైతం నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. చెల్లెలు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని.. ఓ అన్న చెల్లెలిని దారుణంగా చంపాడు. నాటు తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సర్ధనా ప్రాంతంలో చోటు చేసుకుంది. చెల్లెలు ఎవరితోనో సంబంధం పెట్టుకుందన్న కక్షతో.. అన్న హత్యచేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతిరాలి తల్లి షహనో తన భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో సర్ధనా ప్రాంతంలో గత కొంతకాలం నుంచి కలిసి ఉంటోంది. ఆమెకు ఆరీఫ్, సమ్రీన్ అనే ఇద్దరూ పిల్లలు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడంతో పిల్లలు ఆమె తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో సమ్రీన్ స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఇది చూసిన కుటుంబసభ్యులు ఆ వ్యక్తికి దూరంగా ఉండమని పలుమార్లు సూచించారు. అయినప్పటికీ.. ఆమె కుటుంబసభ్యుల మాటలను పట్టించుకోకుండా అలానే ప్రవర్తిస్తోంది.
దీంతో సోదరుడు ఆగ్రహంతో ఆమె నిదురుస్తున్న సమయంలో దేశీయ తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆరీఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: