Hyderabad: ఓర్నీ.. ఏం మనిషివిరా అయ్యా.. గుట్కా కోసం మనిషిని చంపేశావా..?

| Edited By: Balaraju Goud

Feb 10, 2024 | 10:23 PM

గుట్కా విషయంలో నలుగురు మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలిస్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. గగన్ పహాడ్ లోని లియో ల్యామినెట్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తున్నారు విజయ్ బహుదూర్ (52).

Hyderabad: ఓర్నీ.. ఏం మనిషివిరా అయ్యా.. గుట్కా కోసం మనిషిని చంపేశావా..?
Gutka
Follow us on

గుట్కా విషయంలో నలుగురు మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలిస్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. గగన్ పహాడ్ లోని లియో ల్యామినెట్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తున్నారు విజయ్ బహుదూర్ (52). విధులు ముగించుకుని రూమ్ కు వెళ్ళాడు విజయ్ బహుదూర్. అన్నం తిన్న తరువాత నడుచుకుంటూ సెక్యూరిటీ రూమ్ వద్దకు వచ్చాడు.

అయితే సెక్యూరిటీ రూమ్‌లో అప్పటికే తిష్టవేశారు నిత్యానందు, గొళ్ళు, చోటు కుమార్ అనే నలుగురు. అప్పటికీ అందరి మధ్య గుట్కా విషయంలో గొడవ జరుగుతోంది. అప్పుడే వచ్చిన విజయ్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో విజయ్ బహుదూర్ ను చోటు కుమార్ అనే వ్యక్తి కూరగాయలు కోసే చాకుతో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ విజయ్ బహుదూర్ నడుచుకుంటూ వెళ్ళి తన రూమ్ లో కుప్పకూలిపోయాడు. ఇదీ గమనించిన కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యంకు సమాచారం అందివ్వడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే విజయ్ బహదూర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా నిత్యానంద అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి