Tamil Nadu: పరువు ప్రతిష్ట కోసం తమిళనాట ఓ తండ్రి నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాడు. పెద్ద కూతురు కులాంతర వివాహం(Inter-caste Marriage) చేసుకోవడంతో ఆగ్రహం చెందిన తండ్రి భార్య , ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్ద కూతురి మీద కోసం భార్య , ఇద్దరు కూతుళ్ల మీద చూపించాడు లక్ష్మణన్. అయితే ప్రేమ వివాహం చేసుకున్న కూతురు మాత్రం సేఫ్‌గానే ఉంది. ఈ ఘటనతో తమిళనాడు నాగపట్నంలో విషాదం నెలకొంది. పెద్ద కూతురు దళిత యువకుణ్ణి పెళ్లి చేసుకుందన్న మనస్థాపంతో..భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసి..తాను ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి లక్ష్మణన్. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. నాగపట్నం జిల్లా కిలవురుకి చెందిన లక్ష్మణన్ ఓ హోటల్ నడుపుతున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు అదే గ్రామానికి చెందిన ఓ యువకుణ్ణి ప్రేమించింది. ఐతే ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి నిరాకరించాడు తండ్రి లక్ష్మణన్. కానీ ఇంట్లో వారిని కాదని ప్రేమించిన అతన్నే పెళ్లిచేసుకుంది పెద్ద కూతురు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి..భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసింది. లక్ష్మణన్ హత్య చేసిన ఇద్దరు కూతుళ్లలో ఒకరు మైనర్ కావడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమిళనాడులో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పరువు హత్యలు కూడా అక్కడ తరచుగా జరుగుతున్నాయి. తన కూతురిని ఇతర కులానికి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక అల్లుడిని మామలు చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రేమ పెళ్లిళ్లు యువత పాలిట శాపంగా మారుతున్నాయి. నాగపట్నం ఘటనలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి , ఆమె భర్త క్షేమంగానే ఉన్నారు. వాళ్లపై కోపాన్ని లక్ష్మణన్ తన ఇద్దరు కూతుళ్లు , భార్య మీద చూపించాడు.
Als0 Read: పెయిడ్ లీవ్ కోసం పెద్ద నాటకమే వేసింది.. నిజం తెలిసి ఉన్నతాధికారుల మైండ్ బ్లాంక్ అయ్యింది