భార్య హఠాన్మరణం.. భర్త ఏం చేశాడో తెలుసా..?
కట్టుకున్న భార్య కడాదాక ఉంటుందనుకున్నాడు. అయితే విధి చాలా విచిత్ర మైనది.. కడాదాక ఉంటుందనుకున్న తన భార్యను.. ఆ భర్త నుంచి ఆ దేవుడు ముందే దూరం చేశాడు. అంతే తన భార్య లేదన్న దిగులుతో.. ఆ భర్త కుంగిపోయాడు. అంతేకాదు.. నీవు లేని నా జీవితం వృధా అనుకుని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకెళితే.. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డికి చెందిన సుబ్బారెడ్డి.. ఇటీవల తన భార్యను కోల్పోయాడు. […]
కట్టుకున్న భార్య కడాదాక ఉంటుందనుకున్నాడు. అయితే విధి చాలా విచిత్ర మైనది.. కడాదాక ఉంటుందనుకున్న తన భార్యను.. ఆ భర్త నుంచి ఆ దేవుడు ముందే దూరం చేశాడు. అంతే తన భార్య లేదన్న దిగులుతో.. ఆ భర్త కుంగిపోయాడు. అంతేకాదు.. నీవు లేని నా జీవితం వృధా అనుకుని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకెళితే.. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డికి చెందిన సుబ్బారెడ్డి.. ఇటీవల తన భార్యను కోల్పోయాడు. అయితే అప్పటి నుంచి భార్య లేకపోవడంతో.. కుంగిపోయాడు. అంతేకాదు.. ఇక తన భార్యలేని ఈ జీవితం వద్దనుకుని.. శుక్రవారం ఇంటి దగ్గర కత్తితో చేతిపై కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పుంగనూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించారు కుటుంబసభ్యులు. అయితే శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత ఇంటికి వెళ్లే సమయంలో అతని వెంట ఉన్న తల్లి లలితమ్మ కనుగప్పి ఆస్పత్రి భవనంపైకి ఎక్కాడు. అది గమనించని తల్లి.. ఆసుపత్రి భవనం బయటికి వెళ్లిన తరువాత కుమారుడి కోసం వెతకడం ప్రారంభించింది. అయితే అంతలోనే ఆ తల్లికి విషాదాన్ని మిగల్చాడు ఆ కుమారుడు. ఆ ఆస్పత్రి భవనం పైనుంచి కిందకు దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న వైద్యులు చికిత్స అందించినా.. లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలేశాడు. కళ్ల ముందే కుమారుడు మరణం చూసి.. ఆ తల్లి గుండెలు పగిలేలా రోదనలు పెట్టింది. ఆ తల్లి రోదనలు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించాయి. రెండేళ్ల కిందట తన పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడని.. ఇప్పుడు రెండో కుమారుడు ఇలా చేశాడని ఆవేధన వ్యక్తం చేసింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.