Telangana: ఆమె అటవీ శాఖలో సీనియర్​ అసిస్టెంట్.. టైపిస్ట్‌తో రూమ్‌లో.. భర్త ఏం చేశాడంటే..?

|

Feb 26, 2022 | 10:31 AM

Crime News: అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు.. కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.  పచ్చని కాపురాలను కూల్చుతున్నాయి.

Telangana: ఆమె అటవీ శాఖలో సీనియర్​ అసిస్టెంట్.. టైపిస్ట్‌తో రూమ్‌లో.. భర్త ఏం చేశాడంటే..?
Illegal Affair
Follow us on

ఏ గొడవకు కారణం వెతికినా అదే అని తేలుతుంది.  ఏ క్రైమ్‌ వెనుక రీజన్ వెతికినా.. చివరికి అదే లీడ్ దొరుకుతుంది.  అవును.. అక్రమ సంబంధాలు(illegal Affairs), వివాహేతర సంబంధాలు.. కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.  పచ్చని కాపురాలను కూల్చుతున్నాయి. పరులపై వ్యామోహంతో బిడ్డల భవిష్యత్‌ను బలి చేస్తున్నారు కొందరు. తాజాగా కరీంనగర్‌(Karimnagar)లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ భర్త.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆపై కోపం పట్టలేక అతడికి దేహశుద్ధి చేశాడు. వివరాల్లోకి వెళ్తే..  సైదాపూర్​ మండలం(Saidapur Mandal)  సోమారం గ్రామానికి చెందిన రాజేశం.. తన భార్యతో కలిసి కరీంనగర్​ పట్టణం భగత్​నగర్​లో ఉంటున్నారు. అతడి భార్య అటవీ శాఖలో సీనియర్​ అసిస్టెంట్​గా వర్క్ చేస్తోంది. అదే ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తున్న శశిధర్​తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని రాజేశంకు తెలిసింది. గత ఆరు నెలలుగా వారి మధ్య ఈ బాగోతం నడుస్తుందని అతడి ఆరోపణ. రాజేశం భార్యను పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా ఆమె మాట వినలేదు. దీంతో పెద్దలకు విషయం చెప్పాడు. తనను కావాలనే అనుమానిస్తున్నాడని.. ఆధారాలుంటే చూపించాలని ఆమె గట్టిగా మాట్లాడింది. దీంతో అతడు పక్కా ప్లాన్ వేశాడు.

ఇటీవల తన భార్య, టైపిస్టు శశిధర్​… ఇంట్లోని ఓకే గదిలో ఉండగా.. గదికి తాళం వేసి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి తాళం తెరిచి చూడగా.. వారిద్దరిని రెడ్​ హాండెడ్​గా పట్టుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. కుటుంబాన్ని నాశనం చేశాడంటూ శశిధర్​కు దేహశుద్ధి చేశాడు రాజేశం.  పోలీసులు శశిధర్​ను, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది.. ఈ మొక్క గుణాలు తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే