Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరలో ఉప్పు ఎక్కువైందని..క్రూరంగా ప్రవర్తించిన భర్త.. కడుపుతో ఉన్న భార్యపై..

5 నెలల గర్భిణీపై భర్త క్రూరంగా ప్రవర్తించాడు. కూరలో ఉప్పు ఎక్కువైందని తన్నుతూ, గుద్దుతే విచక్షణారహితంగా కొట్టాడు. భార్య వదిలేయాలని ప్రాధేయపడిన వదలకుండా దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కూరలో ఉప్పు ఎక్కువైందని..క్రూరంగా ప్రవర్తించిన భర్త.. కడుపుతో ఉన్న భార్యపై..
Pregnant Woman
Krishna S
|

Updated on: Jul 04, 2025 | 2:20 PM

Share

కొన్ని ఘటనలు చూస్తుంటే పెళ్లిపై నమ్మకమే పోతుంది. పెళ్లిచేసుకోవాలంటేనే భయపడేలా కొంతమంది క్రూరంగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ రాక్షుసుల్లా ప్రవర్తిస్తున్నారు. కొన్ని కాపురాలు అక్రమ సంబంధాలతో పక్కదారి పడితే.. మరికొన్ని బంధాలను వాళ్లకు వాళ్లే చేతులారా చిదిమేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాస్‌గంజ్‌లో 5నెలల గర్భిణి అయిన భార్య పట్ల భర్త అమానుషంగా ప్రవర్తించాడు. కూరలో ఉప్పు ఎక్కువైందని దాడికి పాల్పడ్డాడు. గర్భిణి అని కూడా కనికరం చూపకుండా తన్నుతూ, గుద్దుతూ విచక్షణారహితంగా కొట్టాడు. ఈ క్రూరమైన దాడిలో భార్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మృతురాలి సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు.

కాస్‌గంజ్‌లో రాము – బ్రజ్‌బాల దంపతులు తమ మూడేళ్ల కొడుకుతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం బ్రజ్‌బాల వండిన కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త రాము ఆమెపై దాడికి దిగాడు. ఆమె వదిలేయాలని ప్రాదేయపడినా.. అలాగే విచక్షణారహితంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె పైఅంతస్థు నుంచి కిందికి జారి పడింది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో బ్రజ్‌బాల చికిత్స పొందుతూ మరణించింది.

బ్రజ్‌బాల మరణంపై ఆమె సోదరుడు స్పందించాడు. రాముకు తన వదినతో అక్రమ సంబంధం ఉందని.. ఈ విషయంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్లు ఆరోపించారు. గర్భిణి అని కూడా చూడకుండా తన సోదరిని దారుణంగా చంపేసిన రామును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాము ఇంటి నుంచి పారిపోగా.. గ్రామస్థులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు..
ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు..
ఆడ మొసలిని వివాహం చేసుకున్న మెక్సికో మేయర్‌.. వీడియో వైరల్
ఆడ మొసలిని వివాహం చేసుకున్న మెక్సికో మేయర్‌.. వీడియో వైరల్
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న శివాజీ
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న శివాజీ
ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్