AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సోనమ్ బ్యాగులో రెండు మంగళసూత్రాలు.. రెండోది..

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రియుడు కోసం భర్తను చంపి జైల్లో ఉన్న సోనమ్ బ్యాగులో రెండు మంగళసూత్రాలు దొరకడం కలకలం రేపుతోంది. రెండో మంగళసూత్రం ఎక్కడిదన్న సందేహాలపై రాజా రఘువంశీ సోదరుడు సంచలన విషయాలు వెల్లడించారు.

హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సోనమ్ బ్యాగులో రెండు మంగళసూత్రాలు.. రెండోది..
Sonam Raghuwanshi Case
Krishna S
|

Updated on: Jul 04, 2025 | 3:54 PM

Share

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 8మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితురాలు సోనమ్ బ్యాగులో రెండు మంగళసూత్రాలు ఉండడం కలకలం రేపుతోంది. దీంతో అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇష్టం లేకున్నా కుటుంబసభ్యుల బలవంతంతో రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న సోనమ్.. ఆ తర్వాత పథకం ప్రకారం భర్తను హత్యచేసింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తొలుత మిస్సింగ్ ఘటనగా నమోదైన ఈ కేసులో తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. పెళ్లాయ్యక రాజా రఘువంశీ, సోనమ్ మేఘాలయాకు హనీమూన్ వెళ్లారు. ఆ తర్వాత మే 23న ఈ జంట కన్పించకుండా పోయింది. జూన్ 2న రాజా మృతదేహం లభించగా.. సోనమ్ ఆచూకీ దొరకలేదు. అయితే పోలీసుల విచారణలో సోనమ్ ఈ హత్య చేయించిందని తేలడంతో అంతా నివ్వెరపోయారు.

పెళ్లికి ముందే సోనమ్.. రాజ్ కుశ్వాహను ప్రేమించింది. అయితే వీరి పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదు. ఇక్కడే సోనమ్ కన్నింగ్ ప్లాన్ వేసింది. భర్తను హత్య చేస్తే ప్రియుడి దగ్గరికి వెళ్లొచ్చని అనుకుంది. రాజ్‌తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. తొలుత మిస్ అయినప్పటికీ.. కామాఖ్య గుడికి వెళ్తుండగా సుపారీ గ్యాంగ్ రాజా రఘువంశీని దారుణంగా చంపేశారు. ఈ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. ఇప్పటికే పోలీసులు సోనమ్, రాజ్ కుశ్వాహతో పాటు 8మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా సోనమ్ బ్యాగులో రెండు మంగళసూత్రాలు దొరకడంతో రెండోది ఎక్కడిదనే సందేహాలు మొదలయ్యాయి.

రాజా రఘువంశీని పెళ్లి చేసుకోకముందే సోనమ్‌కు ప్రియుడితో పెళ్లి అయిపోయిందా..? రాజా రఘువంశీని చంపేశాక సోనమ్, కుశ్వాహ పెళ్లి చేసుకున్నారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అంశంపై రఘువంశీ సోదరుడు విపిన్ స్పందించారు. రాజాను చంపేశాక వారిద్దరూ పెళ్లిచేసుకుని ఉండొచ్చని అనుమానించారు. అంతేకాకుండా సోనమ్‌ను కలవాలని ఉందని చెప్పిన ఆమె సోదరుడు గోవింద్‌ను సైతం విపిన్ తీవ్రంగా విమర్శించాడు. ”సోనమ్‌ను ఆమె సోదరుడు గోవింద్ కలవొచ్చు.. ఆమె తరఫున లాయర్‌ను పెట్టి గట్టి వాదనలు వినిపించొచ్చు. కానీ రఘువంశీ చనిపోయిన సమయంలో గోవింద్ మా ఇంటికి ఎందుకు వచ్చాడు. సోనమ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఆమెను కఠినంగా శిక్షించాలని ఎందుకన్నాడు. ఆ కుటుంబమంతా మమ్మల్ని మోసం చేసింది” అని విపిన్ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై గోవింద్ సైతం స్పందించాడు. తాము ఏ లాయర్‌ను సంప్రదించలేదని తెలిపారు. కేసు విచారణ పూర్తై, తన సోదరి సోనమ్‌ను కలిసేవరకు కేసుకు సంబంధించి ఏ న్యాయవాదితోనూ మాట్లాడనని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..