Man Arrest: బరితెగించిన కామాంధుడు.. గర్భం దాల్చిన మేకపై అఘాయిత్యం చేసి హత్య.. నిందితుడి అరెస్ట్!

|

Mar 31, 2022 | 5:02 PM

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. మనిషి అన్న విషయం మరిచిపోయి.. క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఓ దుర్మర్గుడు తన కామవాంఛ తీర్చుకోవడానికి మేకపై పైశాచికానికి పాల్పడ్డాడు.

Man Arrest: బరితెగించిన కామాంధుడు.. గర్భం దాల్చిన మేకపై అఘాయిత్యం చేసి హత్య.. నిందితుడి అరెస్ట్!
Goat
Follow us on

Man Arrested: మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. మనిషి అన్న విషయం మరిచిపోయి.. క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఓ దుర్మార్గుడు తన కామ వాంఛ తీర్చుకోవడానికి మేకపై పైశాచికానికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ(Kerala)లోని కాసర్‌గోడ్(Kasaragod) జిల్లాలో మంగళవారం రాత్రి గర్భవతి అయిన మేకపై అత్యాచారం చేసి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తమిళనాడుకు చెందిన సెంథిల్ అనే హోటల్ కార్మికుడిగా గుర్తించారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు.

హోటల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే శబ్దాలు రావడంతో ఇతర ఉద్యోగులు నిద్ర లేచారు. వారు బయటకు వచ్చినప్పుడు, గర్భవతి అయిన మేక బోను వెలుపల రక్తస్రావం కనిపించింది. సంఘటనా స్థలం నుండి పారిపోతున్న వ్యక్తిని వారు చూశారు. ఆ తరువాత అతన్ని నిందితుడిగా గుర్తించారు. సెంథిల్ దాదాపు రెండేళ్లుగా హోటల్‌లో పనిచేస్తున్నాడు. హోటల్ యాజమాని ఫిర్యాదు మేరకు కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై జంతు హింసకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

ఈ నేరంలో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని యజమానులు చెప్పినప్పటికీ, సెంథిల్‌ మాత్రమే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు ఆధారంగా అసహజ నేరం కింద సెక్షన్‌ను చేర్చినట్లు హోస్‌దుర్గ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.

Read Also… Health News: అన్ని వయసుల పురుషుల కోసం సూపర్ డైట్‌ ఇదే.. కచ్చితంగా పాటించాల్సిందే..!