AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. ఆఫీసులోనే కాల్చి చంపిన ముగ్గురు దుండగులు..

Delhi Gym Owner: తూర్పు ఢిల్లీలో ఉన్న ఎనర్జీ జిమ్ యజమాని మహేంద్ర అగర్వాల్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు.

Crime News:  జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. ఆఫీసులోనే  కాల్చి చంపిన ముగ్గురు దుండగులు..
Crime
Venkata Chari
|

Updated on: Dec 31, 2022 | 1:25 AM

Share

ఢిల్లీలో జిమ్ యజమాని హత్యకు గురయ్యాడు. తూర్పు ఢిల్లీలో ఉన్న ఎనర్జీ జిమ్ యజమాని మహేంద్ర అగర్వాల్ శుక్రవారం (డిసెంబర్ 30) తన కార్యాలయానికి వెళ్లిన తర్వాత అతనిపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. పోలీసుల నివేదిక మేరకు.. మహేంద్రపై మొత్తం మూడు బుల్లెట్లు ఉన్నాయని, అందులో ఒక బుల్లెట్ అతని తలకు తాకిందని తెలిపారు.

మహేంద్ర అగర్వాల్ తన జిమ్ ఆఫీసులో పని చేస్తున్నాడు. ఇంతలో శుక్రవారం (డిసెంబర్ 30) ఎనిమిది గంటల సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. అతనికి చాలా జిమ్‌లు ఉన్నాయి. అలాగే ఆయన జిమ్ ఉపకరణాల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఆయన్ను హత్య చేసిన ఈ ఎనర్జీ జిమ్ ప్రీత్ విహార్‌లోని వికాస్ మార్గ్‌లో ఉంది.

పోలీసులు ఏం చెప్పారంటే?

మహేంద్ర అగర్వాల్ హత్య తర్వాత పోలీసులు జిమ్‌కు చేరుకున్నారు. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం, ప్రత్యేక సిబ్బంది మొత్తం కేసును విచారిస్తున్నారు. దీంతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం కూడా దీనిపై విచారణ జరుపుతోంది. దీంతో పాటు ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో పాటు మృతుడు మహేంద్ర కుటుంబీకులతో కూడా చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us