Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు

|

Jun 28, 2021 | 11:58 AM

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వారికి సంబంధించిన భారీ నగదును మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. మావోయిస్టుల(Maoists)కు డబ్బులు చేరవేస్తున్న కొరియర్లను 

Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు
Maoist Dump
Follow us on

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వారికి సంబంధించిన భారీ నగదును మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. మావోయిస్టుల(Maoists)కు డబ్బులు చేరవేస్తున్న కొరియర్లను  పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకు.. మహారాష్ట్ర సరిహద్దులో తనిఖీలు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది అనుమానాస్పదంగా కనిపించటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులకు సంబంధించిన 5 కోట్ల రూపాయలను సోమవారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులోని శివారు ప్రాంతమైన గోరఖ్ దందా గ్రామంలో రూ .5 కోట్ల అక్రమ రవాణాకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ మావోయిస్టులకు ఇవ్వడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పట్టుబడిన నగదుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎవరి వద్ద నుంచి సేకరించారు. వీరికి ఇంత పెద్ద మొత్తంలో అందించిన ఎవరూ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోట్లపై బ్యాంక్ ముద్రల ఆధారంగా వారు ఎవరి నుంచి తీసుకొస్తున్నారో ఈజీగా గుర్తు పట్టొచ్చని పోలీసులు అంటున్నారు. అయితే తెలంగాణలోని ఏ ప్రాంతంలో వీటిని వీరు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారో అనేది తెలియల్సి ఉంది. అయితే ఈ నగదు ఎందుకోసం ఉపయోగిస్తారో తెలియాల్సి ఉంది. పట్టుబడిన వ్యక్తులకు మావోయిస్టులతో ఎంత కాలంగా సంబంధాలు కలిగి ఉన్నారనేది కూడా చూడాలని ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి: తొలకరి వచ్చింది.. వజ్రం దొరికింది.. జొన్నగిరి కూలిని లక్షాధికారిని చేసింది..

T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు