ఆస్కార్ ఇస్తే వీళ్లకే ఇవ్వాలేమో..! మూవీ చూసి అంతలా ఇన్‌స్పైర్ అయ్యారు మరీ. అంతేకాదు ఏ మాత్రం తేడా రాకుండా నటించారు. ఐటీ ఆఫీసర్లా అవతారం ఎత్తి భారీ రాబరీకి పాల్పడ్డారు కేటుగాళ్లు. ఇంతకీ ఏ మూవీ చూసి ఇన్‌స్పైర్ అయ్యారు..! వాళ్లు చేసిన రాబరీ ఏంటీ..? రీల్ సీన్…రియల్ సీన్…అచ్చం హిందీలో అక్షయ్‌కుమార్ నటించిన చబ్బీస్-26 అదే..స్పెషల్-26 మూవీ. ఈ సినిమాలో నకిలీ ఐటీ ఆఫీసర్‌గా అక్షయ్‌కుమార్ టీమ్ నటించారు. అదే సినిమాను ఇన్‌స్పైర్‌గా తీసుకున్నారు ఈ రాబరీ టీమ్. రాబరీ వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరిజిల్లాకు చెందిన జశ్వంతో..తన టీమ్ కలిసి నకిలీ ఐటీ అధికారిగా అవతారమెత్తారు.
అచ్చం సినిమా ఫక్కీలో ఫేక్ ఐటీ అధికారులు.. సూటూ బూటూతో దొరబాబుల్లా ఎంటరై… దోపిడీ దొంగల్లా ఎక్సిట్ అయ్యారు. ఒరిజినల్ పోలీసుల్ని సైతం బురిడీ కొట్టించే మహా మాయగాళ్ళు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 134 తులాల బంగారంతో ఉడాయించారు కేటుగాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఫేక్ ఐటీ ఆఫీసర్స్ ఘరానా దోపిడీ జనం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. గచ్చిబౌలీలో సోమవారం అచ్చం ఇలాగే సినిమాఫక్కీలో జరిగిన దోపిడీ కేసు ఇప్పుడు నగరంలో సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ గచ్చిబౌలి నానక్‌రాంగూడలోని ఓ ఇంట్లో లూఠీకి పాల్పడింది ఓ దోపిడీ ముఠా.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిబిఐ అధికారులమంటూ జయభేరి ఆరెంజ్ కౌంటీ అపార్ట్మెంట్ లోకి ప్రవేశించారు దుండగులు. ఎంట్రెన్స్ లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తాము ఐటీ అధికారులమంటూ ఐడి కార్డులు చూపించారు. సి బ్లాక్ 110 లో ఉన్న భాగ్యలక్ష్మి ఇంట్లోకి వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు.
కేటుగాళ్లు ఇచ్చిన బిల్డప్‌కు భయపడిపోయిన సెక్యూరిటీ సిబ్బంది… ఎంట్రన్స్‌కు క్లియరెన్స్ ఇచ్చేశారు. భాగ్యలక్ష్మి ఇంట్లోకి వెళ్లిన దుండగులు… ఇన్ కమ్ టాక్స్ అధికారులమంటూ తెగ హడావుడి చేసేశారు. గంటన్నర పాటు ఇల్లంతా సోదాలు చేసినట్టు యాక్షన్ చేసి, లాకర్ లో ఉన్న బంగారంతో పాటు 2 లక్షల నగదు ఎంచక్కా ఎత్తుకెళ్లిపోయారు.
వచ్చినవాళ్ళు ఐటీ అధికారులు కాదని తెలుసుకున్న బాధితులు.. లబోదిబోమన్నారు. మోసం జరిగిందని గ్రహించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జయభేరి ఆరెంజ్ కౌంటీలోని సీసీ పూటేజీ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు.
బ్లాక్‌మనీ కాబట్టి.. దోపిడీ చేసినా ఫిర్యాదు చెయ్యడనే ధైర్యంతో జశ్వంత్ తన స్నేహితుడితో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. అయితే పోలీసులు ఈ గ్యాంగ్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. సొమ్ము మొత్తం రికవరీ చేశారు.
అయితే చెబ్బీస్-26 మూవీలో అక్షయ్‌కుమార్ దొరికిపోలేదు కానీ.. ఇక్కడ రియల్ సీన్‌లో మాత్రం ఈ రాబరీ చేసిన దొంగలు దొరికిపోయారని కామెంట్ చేశారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.
మొత్తానికి మారుతున్న ట్రెండుకు తగ్గట్టుగా.. కేటుగాళ్లు తెలివి మీరుతున్నారు. పక్కా ప్లాన్ అమలు చేస్తూ.. దోపిడీలకు తెగబడుతున్నారు. మూవీలు చూసి.. వాటిని ఫాలో అయ్యి.. జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: బెజవాడలో ఘరానా చోరీ.. షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి కెమెరామెన్‌కు కుచ్చుటోపీ.. కెమెరాలతో ఉడాయించిన దొంగలు.
Chandrababu: తిరుచానూరులో అమరావతి రైతులు సభ.. హాజరుకానున్న చంద్రబాబు..