Ganja Seize: పనస పండ్ల మాటున గంజాయి తరలింపు.. దర్జాగా ఒడిషా నుంచి ఏపీకి.. కట్ చేస్తే..

jackfruit truck - Ganja Seize: లారీ పనస పండ్ల లోడ్‌తో వెళుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. డ్రగ్ మాఫియా స్కాం బట్టబయిలైంది. ఒడిశాలోని

Ganja Seize: పనస పండ్ల మాటున గంజాయి తరలింపు.. దర్జాగా ఒడిషా నుంచి ఏపీకి.. కట్ చేస్తే..
Ganja Seize

Updated on: May 04, 2021 | 6:14 PM

jackfruit truck – Ganja Seize: లారీ పనస పండ్ల లోడ్‌తో వెళుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. డ్రగ్ మాఫియా స్కాం బట్టబయిలైంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా జాలాపుట్ గ్రామం స‌మీపంలో మ‌చ్‌కుంద్ పోలీసులు లారీలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనంచేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 1,008 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప‌న‌స పండ్ల లోడుతో ఒడిశా నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరుకు వెళ్తున్న లారీని ఆపి త‌నిఖీ చేయ‌గా.. గంజాయి గుట్టు బట్టబయిలైందని పోలీసులు వెల్లడించారు.

తనిఖీలు చేస్తుండగా.. ప‌న‌స పండ్ల కింద ఉన్న బ‌స్తాల్లో గంజాయి ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వెంట‌నే లారీని సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు. గంజాయి బ‌స్తాల‌ను దించి తూకం వేయ‌గా 1,008 కిలోల బ‌రువు ఉందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి మొత్తం విలువ కోటి రూపాయ‌లకు పైగా ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. లారీ డ్రైవ‌ర్ స‌హా మొత్తం ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్ల‌డించారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు నందపూర్ సంజయ్ మోహపాత్ర వెల్లడించారు.

Also Read:

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పే ఫిక్సేషన్ గడువు పెంచుతూ మోదీ సర్కార్ ఉత్తర్వులు.. స్థిర చెల్లింపులు పొందేందుకు అప్షన్లు

JEE Main 2021: కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కేంద్రం ప్రకటన..