Amalapuram: లిక్కర్ గోడౌన్‌లో పనిచేస్తోన్న యువతిపై డిపో మేనేజర్ లైంగిక వేధింపులు.. భరించలేక ఆమె ఏం చేసిందంటే

|

Jan 26, 2022 | 7:50 PM

ఎన్ని చట్టాలు తెచ్చిన కామాంధులు మారడం లేదు. మహిళలపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పని చేసే ప్రాంతాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులు.. మహిళా ఉద్యోగిణిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

Amalapuram: లిక్కర్ గోడౌన్‌లో పనిచేస్తోన్న యువతిపై డిపో మేనేజర్ లైంగిక వేధింపులు.. భరించలేక ఆమె ఏం చేసిందంటే
Harassment
Follow us on

Workplace harassment: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లో వెలుగుచూసిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాశమైంది.  అమలాపురం లిక్కర్ గొడౌన్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై డిపో మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తొలుత భయంతో ఎవరికి చెప్పకుండా తన మనసులోనే బాధను దాచుకున్న ఉద్యోగిని.. రోజురోజుకు అతగాడి చేష్టలు అతి అవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది.  డిపో మేనేజర్ వై.ఆదినారాయణ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని  కాకినాడ(Kakinada) దిశా పోలీస్ స్టేషన్లో సదరు యువతి ఫిర్యాదు చేసింది. వివరాలు నమోదు చేసుకుని కేసును అమలాపురం పోలీస్ స్టేషన్ కు సిఫార్సు చేసింది కాకినాడ దిశా పోలీస్ స్టేషన్.  వివరాల్లోకి వెళ్తే.. అమలాపురం APSBCL లిక్కర్ గోడౌన్ లో గత రెండు నెలలుగా అవుట్ సోర్సింగ్ కేటిగిరీలో నందిత(పేరు మార్చాం) అనే యువతి ఉద్యోగం చేస్తోంది. ఉన్నత స్థానంలో ఉన్న డిపో మేనేజర్ ఆదినారాయణ కిందిస్థాయి ఉద్యోగి నందితను తన కోరికలు తీర్చాలని వేధింపులుకు గురి చేస్తున్నాడు. పదే, పదే ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. యువతి పనిచేస్తున్న వర్క్ స్టేషన్ కు వచ్చినప్పుడు తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు.

అతడి వేధింపులు తీవ్రం అవ్వడంతో పక్కా ఆధారాలతో పోలీసులను ఆశ్రయించింది యువతి. డిపో మేనేజర్ ఫోన్ చేసి.. అతిగా మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డ్ చేసింది. ఆధారాలతో సహా రిపబ్లిక్ డే రోజు ఉన్నతద్యోగి బాగోతం బయటపెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరపుతున్నారు.

Also Read: కోవిడ్ పాజిటివ్ మహిళకు ప్రసవం చేయడానికి వైద్యుల నిరాకరణ.. వారిపై సీరియస్ యాక్షన్