iPhone 13 Smuggling: ఖరీదైన యాపిల్ ఐఫోన్లు స్మగ్లింగ్ రాకెట్ ముఠా గుట్టురట్టయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. అక్రమంగా తరలిస్తున్న 3,646 ఐఫోన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్(DRI) అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సీజ్ చేశారు. ఓ పార్సిల్‌లో భారీ సంఖ్యలో ఐఫోన్లను అక్రమంగా తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. హాంకాంగ్ నుంచి దీన్ని దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దిగుమతి సుంకాలను ఎగ్గొట్టేందుకు ‘మెమరీ చిప్స్’ పేరిట ఐఫోన్లను అక్రమంగా పార్సిల్‌లో దాచి ముంబైకి తీసుకొచ్చి.. ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ పార్సిల్‌లో 2,245 ఐఫోన్ 13 ప్రో, 1,401 ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, 12 గూగుల్ పిక్సెల్ 6 ప్రో, 1 యాపిల్ స్మార్ట్‌వాచ్ ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. పార్సిల్‌లోని వస్తువుల జాబితాలో ఐఫోన్స్ ఉన్నట్లు దిగుమతిదారులు ఎక్కడా డిక్లేర్ చేయలేదని గుర్తించినట్లు తెలిపారు. కస్టమ్స్ యాక్ట్ 1962 కింద వీటిని సీజ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సీజన్ చేసిన ఐఫోన్ల విలువ దాదాపు రూ.42.86 కోట్లుగా ఉండొచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. పార్శిల్‌లోని వస్తువుల విలువను కేవలం రూ.80 లక్షలుగా డిక్లేర్ చేసినట్లు తెలిపారు.
ఐఫోన్ 13 మోడల్స్‌ను సెప్టెంబర్ మాసం నుంచి దేశీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. బేసిక్ మోడల్స్‌ను ఒక్కోటి రూ.70వేల వరకు విక్రయిస్తుండగా.. హై ఎండ్ ఫీచర్స్ ఉన్న మోడల్‌ను రూ.1,80,000 వరకు విక్రయిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లపై 44శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎగ్గొట్టి ఐఫోన్లను అక్రమంగా దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
గతంలోనూ ఈ ముఠా ఐఫోన్లను ఇలా అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి విక్రయించిందా? అన్న అంశంపై డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.
DRI busts iPhone smuggling Racket
Link to Press Release ? https://t.co/UzLVIcRp7d pic.twitter.com/8k0aAWTEZr
— CBIC (@cbic_india) November 28, 2021
Also Read..
Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో ఈ ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెలివరీ..