Labrador Dog Murder: దేశంలో రోజురోజుకూ దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ. ఆరు లక్షలు విలువ చేసే ఓ లాబ్రిడార్ జాతి కుక్కను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా చంపాడు. కుక్క హత్యకు గురైన ఈ సంఘటన హర్యానాలోని కర్నల్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నల్‌కు చెందిన సాగర్.. కొన్ని నెలల క్రితం షేర్‌ఘర్ ప్రాంతంలోని కుక్కలు అమ్మే డీలర్ దగ్గరి నుంచి మూడు లక్షలు రూపాయలు వెచ్చించి చోటా రాజ అనే లాబ్రిడార్ జాతికి చెందిన కుక్కను విక్రయించాడు. పోషకాహారం పెట్టి దాన్ని బలంగా తయారు చేశాడు.
ఈ క్రమంలో.. దాని మీద కన్నేసిన మాజీ ఓనర్ కుక్క కావాలంటూ రంగంలోకి దిగాడు. ఆ కుక్కను ఆరు లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుందామని సాగర్‌తో వారించడం ప్రారంభించాడు. దీంతో సాగర్‌కు, మాజీ ఓనర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిరోజుల క్రితం చోటా రాజ కనిపించకుండా పోయింది. అనంతరం ఆదివారం దారుణంగా హత్యకు గురై కనిపించింది. దీంతో సాగర్ పోలీసులను ఆశ్రయించాడు. మాజీ ఓనరే చోటా రాజను చంపాడని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: