Kurnool Police Vehicle search: కర్నూలు శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర SEB అధికారులు కొంచెంసేపటి క్రితం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గద్వాల నుంచి కర్నూలుకు వస్తున్న ఆర్టీసీ బస్సులోనూ తనిఖీలు చేశారు. అయితే, బస్సులో ప్రయాణీస్తోన్న ఒక వ్యక్తి రసీదులు లేకుండా దాదాపు ఒకటిన్నర కేజీ బంగారు ఆభరణాలు తరలిస్తుండటం పోలీసుల కంటపడింది.
దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆభరణాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కర్నూలు లాల్ బహదూర్ శాస్త్రి నగర్‌కు చెందిన అబ్దుల్ హక్ అని పోలీసులు తెలిపారు.
గంజాయి గ్యాంగ్ వార్: కత్తులు, బండరాళ్లతో రోడ్డుపై కొట్టుకున్న ముఠా.. ఒకరు మృతి
తమిళనాడులో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. గంజాయి గ్యాంగ్ గల్లీలో కత్తులు, బండరాళ్లతో కొట్టుకున్నారు. నార్త్ చెన్నై లోని తండయార్పెట్టలో వున్న హోసింగ్ బోర్డులో గంజాయి అమ్మకాల్లో ఇరువర్గాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరి చివరికి ప్రాణాలు పోయేంతలా కొట్టుకునే స్థితి వచ్చింది.
జరిగిన దారుణాన్ని కళ్లారా చూసిన స్థానిక మహిళలు అరుపులతో ఘటనా ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. ప్రత్యర్థులు కొట్టిన దెబ్బలకు ఒక యువకుడు మృతి చెందడంతో హోసింగ్ బోర్డు కాలనీ మొత్తం ఉద్రిక్తంగా మారింది.
కాలనీలో ఉన్న మహిళలు, కొందరు స్థానికులు ఎంత వారించినా వినకుండా సదరు గంజాయి గ్యాంగ్ కత్తులతో, బండరాళ్లతో ఒక సినిమా క్రైం సీన్‌ను తలపించేలా అరాచకం సృష్టించారు. చివరికి ఈ గ్యాంగ్ వార్‌లో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.