Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..

|

Feb 27, 2021 | 2:41 PM

ఎన్నారైలే టార్గెట్‌... నెల్లూరు నుంచే ఆపరేషన్... ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు... గొంతు మార్చే సాఫ్ట్‌వేరుతో ఆకట్టుకునే ఫోన్ సంభాషణ.. ఇలా నమ్మే ఖాతా ఖాళీ..

Crime News: ఎన్నారైలే టార్గెట్‌... నెల్లూరు నుంచే ఆపరేషన్... ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు... గొంతు మార్చి..
woman Cheating
Follow us on

Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చే సాఫ్ట్‌వేరుతో ఆకట్టుకునే ఫోన్ సంభాషణ.. ఇలా నమ్మే ఖాతా ఖాళీ. హైదరాబాద్‌ వేదికగా కిలాడీ లేడీ నయా మోసం.. మ్యాట్రీమోని వెబ్‌సైట్‌తో బోల్తా కొట్టించిందీ బుల్‌బుల్‌ పిట్ట. చివరకు పోలీసులు ఎంటరై ఊచలు లెక్కపెట్టిస్తున్నారిప్పుడు.

ఈమె పేరు అర్చన అలియాస్‌ స్వాతి… నెల్లూరు జిల్లా వాసి… ఎంబీఏ చదువుకుంది. భర్త ఓ ప్రైవేటు కాలజీలో లెక్టరర్‌. వచ్చిన కాస్త సంపదతోనే హాయగా ఉందామనుకుంటే స్టోరీ చెప్పుకునే వాళ్లమే కాదు. కానీ ఆమె అత్యాశపడింది. ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడింది. జీవితం మలుపు తిరిగి డబ్బు సంగతి దేవుడెరుగు… కటకటాపాలైంది. ఉద్యోగం చేయడం కంటే.. సైబర్‌ మోసం ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంది స్వాతి. అమెరికాలో పెద్ద హోదాలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయిలా తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించేది. వాటికి అందమైన యువతుల ఫొటోలు జత చేసేది. తన ప్రొఫైల్‌ నచ్చిన వచ్చే వారితో కలుపుగోలుగా మాట్లాడేది. తన గొం తు ఆకట్టుకునేలా ఉండేందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకుందీ కిలాడీ. అమెరికా నుంచి ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించేలా వర్చువల్‌ ఫోన్‌ నెంబర్లతో కాల్‌ చేసేది.

కొన్నిరోజులు మాట్లాడి భారత్‌ వస్తున్నానని చెప్పేది. ఇంతలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని డబ్బులకు ఎరవేసేది. అవతలి వాళ్లు డబ్బు వేయగానే ఆ కాంటాక్ట్‌ కట్‌ అయ్యేది. రాచకొండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం, ఇదే తరహాలో 5లక్షలు మోసపోయింది. దీంతో వారు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. అధికారులు రంగంలోకి దిగి నెల్లూరు స్వాతి ఆటకట్టించారు. ఇప్పటికే ఆమె పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిందని తెలిసింది. నిందితురాలి వద్ద రూ. 5.16 లక్షలతో పాటు.. ఒక ల్యాప్‌టాప్‌, ఏడీకామ్‌ వాయిస్‌ చేయింజింగ్‌ సాఫ్ట్‌వేర్‌, ఏటీఎం కార్డులు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Also Read:

Crime News: పశువుల పాకలో ఉరికి వేలాడిన మహిళ.. అందరూ ఆత్మహత్యే అనుకున్నారు.. కానీ చిక్కుముడి ఇలా వీడింది

దంపతుల మధ్య విభేదాలు.. కన్నకొడుకుని రోడ్డు పై వదిలేసిన తల్లి.. చివరకు ఆ చిన్నారి..