
చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకుంటున్న కేసులు పెరిగాయి. ముఖ్యంగా విద్యార్థులు క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ ఎమ్మెల్యే కేపీ బచేగౌడ బంధువు అయిన హేమంత్ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కబళ్లాపూర్ తాలూకాలోని తన పాత్రేనహళ్లి ఫామ్‌హౌస్‌లో ఈరోజు (ఏప్రిల్ 9, బుధవారం) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ముద్దెనహళ్లిలోని సత్యసాయి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న హేమంత్, తన డాక్టర్ తల్లితో కలిసి ట్రిప్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ, ఏమైందో ఏమో కానీ సాయంత్రం స్నానం చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. హేమంత్ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. హేమంత్ మృతదేహాన్ని చిక్కబళ్లాపూర్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
కాలేజీకి వెళ్లమని చెప్పి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాగర్ తుకారాం కురాడే (19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెల్గాం జిల్లా చిక్కోడి తాలూకాలోని నాగరల్ గ్రామంలో చోటుచేసుకుంది. సాగర్ చిక్కోడిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో BCA చదువుతున్నాడు. తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లమని మందలించి చెప్పినందుకు అతను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.