AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలాడీ లేడీ..అందమైన ఫోటోలతో ఎన్నారైకి కుచ్చుటోపీ..రూ. 65లక్షలు స్వాహా

మ్యాట్రిమొనీ పేరుతో సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పెట్టి..అమాయక యువకులను బురిడీ కొట్టించిన మాయలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా,..కంగుతినే వాస్తవాలు బయటపడ్డాయి.

కిలాడీ లేడీ..అందమైన ఫోటోలతో ఎన్నారైకి కుచ్చుటోపీ..రూ. 65లక్షలు స్వాహా
Jyothi Gadda
|

Updated on: May 28, 2020 | 5:51 PM

Share

హైదరాబాద్‌లో ఉంటూ ఎన్నారైని మోసం చేసిన కిలాడీ లేడీ గుట్టు రట్టు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. మ్యాట్రిమొనీ పేరుతో సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పెట్టి..అమాయక యువకులను బురిడీ కొట్టించిన మాయలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా,..కంగుతినే వాస్తవాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలించగా…

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లో ఉంటున్న మాళవిక అనే మహిళ అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడింది. ఆమెకు కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. మాళవిక భర్త, అత్త, మామ కూడా ఆమె చేస్తున్న మోసాలకు అడ్డుచెప్పలేదు. పైగా ఆమెకు వత్తాసు పలికారు. దీంతో తాను ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఫ్యామిలీ ప్యాకేజీ తరహాలో ఓ మ్యాట్రిమొనీ సైట్‌ని ప్రారంభించింది. అందులో అందమైన ఫోటోలు పెట్టి యువకులకు వల వేయసాగింది.

ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరుణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికి తానొక డాక్టర్‌నని చెప్పుకుంది మాళవిక..హైదరాబాద్‌లో తమకు చాలా ఆస్తులు ఉన్నాయని, వాటిపై వివాదాలు నడుస్తున్నాయని చెప్పింది. ఆస్తులు కాపాడుకోవాలంటే..కొంత డబ్బు కావాలంటూ కట్టు కథలతో ఎరవేసింది. అలా అతడి వద్ద నుంచి ఏకంగా రూ. 65 లక్షలు కాజేసింది. చివరకు అతడికి అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఎన్నారైను మోసం చేసిన కేసులో తల్లి మాళవిక, కుమారుడు ప్రణవ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, గతంలోనూ ఇటువంటి కేసుల్లో మూడు సార్లు ఆమె అరెస్టైనట్లు పోలీసులు తెలిపారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..