Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో ఎల్‌టీఈ టాప్ కమాండర్

Parimpora Encounter: జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్‌లోని మలూరా పరింపొరాలో

Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో ఎల్‌టీఈ టాప్ కమాండర్
Encounter In In Jammu And Kashmir

Updated on: Jun 29, 2021 | 9:13 AM

Parimpora Encounter: జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్‌లోని మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు. మృతుల్లో పాక్‌ ఉగ్రవాది, లష్కరే తోయిబా (ఎల్‌టీఈ)కు చెందిన టాప్‌ కమాండర్‌ నదీమ్‌ అబ్రార్‌ ఉన్నాడు. భద్రతా దళాలు, స్థానిక పౌరులపై దాడులు జరిపి పొట్టన పొట్టుకున్న అబ్రార్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ జరుపగా.. అబ్రార్‌ తన ఏకే-47 రైఫిల్‌ను ఇంట్లో ఉంచినట్లు వెల్లడించాడు.

ఈ క్రమంలో ఆయుధాలను రికవరీ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఇంట్లో దాక్కున్న మరో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరుపడంతో అబ్రార్‌ సైతం కాల్పుల్లో మృతి చెందాడు. అతనితోపాటు మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.

Also Read:

REPCO Bank Recruitment: రెప్కో బ్యాంక్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. షార్ట్ లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Lightning Strike: పిడుగుపాటుకు ఐదుగురు బలి.. మృతుల్లో నలుగురు చిన్నారులు..