పైసలిస్తేనే పని. సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు.. నకిలీ చలానాల కొత్త బాగోతాలు

|

Sep 04, 2021 | 11:24 AM

పైసలిస్తే కానీ.. పనికాదు. ఇంకా త్వరగా అయిపోవాలంటే.. పై స్థాయి అధికారుల చేతులు తడపాలి. అసలు ఎలాంటి రిస్క్‌

పైసలిస్తేనే పని. సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు..  నకిలీ చలానాల కొత్త బాగోతాలు
Ongole
Follow us on

Fake Challan Scam – Ongole: పైసలిస్తే కానీ.. పనికాదు. ఇంకా త్వరగా అయిపోవాలంటే.. పై స్థాయి అధికారుల చేతులు తడపాలి. అసలు ఎలాంటి రిస్క్‌ లేకుండా పేపర్ వర్క్ స్మూత్‌గా అయిపోవాలంటే మీడియేటర్స్‌ని అప్రోచ్ అవ్వాలి. ఈ లాజిక్‌ని పట్టుకకొనే అక్రమార్కులు అడ్డదారిని సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇదేదో బాగుందని అధికారులు, మధ్యవర్తులు లూప్ హోల్స్ క్రియేట్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయంగా మారిందన్న విమర్శలు, ఫిర్యాదులతో ప్రభుత్వం సమూలంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

ఏపీలో సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అక్రమార్కుల దుమ్ము దులుపుతోంది ప్రభుత్వం. అధికారులు, మధ్యవర్తులు కుమ్మక్కు కావడంతో.. సర్కారు ఆదాయానికి భారీగా గండి పడుతోంది. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో జరుగుతున్న అవినీతి దందాపై ఫిర్యాదులు పుంకాలు పుంకాలుగా రావడంతో దఫాలు వారిగా కొరడా ఝుళిపిస్తున్నారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలో ఒంగోలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలానాల భాగోతం బట్టబయలైంది.

ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 2020 ఏప్రిల్ నుండి 2021 మే నెల వరకు అంటే సుమారు సంవత్సర కాలంలో రూ. 10వేల చలానాను 60వేలుగా చూపిస్తూ 77చలానాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ. 26 లక్షల 74వేల రూపాయలు గండి కొట్టారు. రాష్ట్ర రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇద్దరు డాక్యుమెంట్‌ రైటర్లుగా ఉన్న పవన్ కుమార్, క్రాంతి కుమార్‌ సొమ్ము కాజేసినట్లు గుర్తించారు. వారి నుంచి మొత్తాన్ని రికవరీ చేశారు. ఇద్దరిపై పోలీస్ కేసు పెట్టడమే కాకుండా..ఇంకా ఈ అవినీతి డొంకలో దాగున్న వాళ్లను బయటకులాగుతున్నారు అధికారులు.

Ongole Sub Registrar Office

Read also: Badvel By-Election: బద్వేలు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి అధికారికంగా ఖరారు.. ఎవరంటే..?