ఎర్రచందనం స్మగ్లర్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వరుసగా రెడ్ స్మగ్లర్స్‌ని అరెస్టు చేస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కుప్పం-కృష్ణగిరి హైవేలో పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు రామనాథరెడ్డి. కొంతకాలంగా రామనాథరెడ్డిపై పోలీసులు నజర్ పెట్టారు. అతని అనుచరులపై సైతం ఓ కన్నేసిన ఖాకీలు..అదనుకోసం వెయిట్ చేశారు. ఈ తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారంతో జాతీయ రహదారిపై నిఘా ఉంచారు. ఓ వాహనంలో సుమారు 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.రామనాథరెడ్డితోపాటు ముగ్గురు అనుచరులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్థానికుల సహకారంతో..
ఎర్ర చందనం దొంగలకు స్థానికుల సహకారం ఉంటుందోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వార్థ చింతనతో సహకరించడం వల్ల విలువైన ఎర్ర చందనం సరిహద్దులు దాటుతోంది. ఇటీవల మళ్లీ దాడులుకు తెగించి అడవులను నరకుతున్నారు. గుట్టుగా కలపను రవాణా చేస్తున్నారు. స్థానిక నేతలు కొందరు స్మగ్లర్లకు సహకరించడం వల్ల కఠిన చర్యలు తీసుకుంటున్నా అడపాదడపా ఎర్రచందనం తరలుతూనే ఉంది.
ఇప్పటికే ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నప్పటికీ వారి కళ్లుగప్పి కలపను తరలిస్తున్నారు. ఎర్రకూలీల తరలింపులో డ్రైవర్ల పాత్రపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. మరికొందరి పాత్రపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉందన్నారు. తమిళ కూలీలకు సహకరిస్తే కాసులపంట పండిరచుకునే అవకాశం ఉండటంతో డ్రైవర్లు కక్కుర్తిపడినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్ పేరుతో నాలుగు నామినేషన్లు..
CM Jagan: ప్రధాని గారు.. విద్యుత్ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్..
Facebook Apologised: అంతరాయానికి చింతిస్తున్నాం.. మరోసారి సారీ.. చెప్పిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్..
Beer: బీరు ప్రియులకు చేదువార్త.. 27 వేల 264 బాటిల్స్ బీరును పారబోసారు.. ఎందుకో తెలుసా..