Credit Card Fraud: ఫోన్ కాల్ వారి పెట్టుబడి.. రూ.50 కోట్లు స్వాహా.. క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

|

Jan 14, 2022 | 7:01 AM

అంతా ఇంట్లో ఉండే పని నడిపించేస్తారు. మీ క్రెడిట్‌ కార్డు(Credit Card)లో సొమ్ముని దోచేస్తారు. ఇలా 50 మందితో ఏర్పడ్డ ముఠా రూ.50 కోట్లు కొట్టేశారు.

Credit Card Fraud: ఫోన్ కాల్ వారి పెట్టుబడి.. రూ.50 కోట్లు స్వాహా.. క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Credit Card Fraud
Follow us on

Credit Card fraudster gang Nabbed: అంతా ఇంట్లో ఉండే పని నడిపించేస్తారు. మీ క్రెడిట్‌ కార్డు(Credit Card)లో సొమ్ముని దోచేస్తారు. ఇలా 50 మందితో ఏర్పడ్డ ముఠా రూ.50 కోట్లు కొట్టేశారు. విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డు(International credit card)లే లక్ష్యంగా క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను, వల పన్ని పట్టుకున్నారు సైబారాబాద్ పోలీసులు(Cyberabad Police). బ్యాంకు వినియోగదారులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా, క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, పూర్తి వివరాలు ఇస్తే వెంటనే యాక్టివేట్ చేస్తామని చెబుతుంటారని వివరించారు సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర. ఆ తర్వాత ఆ వివరాలతో ఆ కార్డులను క్లోనింగ్ చేసి, ఆన్‌లైన్ ద్వారా విదేశాల్లో ఆ కార్డులను విక్రయిస్తున్నారని తెలిపారు.

ఇలా ఎక్కువగా విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా వీరు మోసాలకు పాల్పడ్డారని చెప్పారు సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర. వీరి మోసాలలో ముఖ్యంగా, విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న పలు భారతీయ బ్యాంక్‌లకు ఈ గ్యాంగ్ టోకరా వేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే భారత్‌లో 80 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తుందని, ఈ ముఠాకు, దుబాయ్‌లో ఉన్న మరో రెండు గ్యాంగ్‌లు సహకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

ఈ సైబర్‌ ముఠా నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌పై దాడులు జరిపారు పోలీసులు. కోటి 11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని అనే కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఈ ముఠా ఇప్పటివరకు 50 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్టు పోలీసు కమిషనర్ చెప్పారు.

Read Also….  AP PRC: ఏపీలో ఇంకా కొలిక్కిరాని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు.. సీఎంవో చుట్టూ తిరుగుతున్న జేఏసీ!